ఉగాదితో కొత్త శోభ వచ్చింది
ప్రజలల్లో నూతనోత్తేజం తెచ్చింది
లక్ష్యసాధనలో ఓటమి చెందిన హృదయాల్లో
గెలుపు సాధించాలనే కసి మళ్ళీ మొదలవుతుంది
జీవితంలో షడ్రుచుల వంటి
అనుభవాలేదుర్కొని
కష్టాలకడలినీదగలుగుతారు
కల్మషంతో నిండిన మనసులు
సైతం సహృదయతతో ఈ కొత్త
సంవత్సరం నుండి ఉండాలని
కోరుకుంటాయి
పగలు ప్రతీకారాలు కొట్లాటలతో
మోడుబారిన జీవితములు
ఇవన్నీ మరిసిపోయి కొత్త
జీవితంలోకి అడుగు పెడతాయి
పెద్దలు సైతం వాళ్ళ పిల్లలకు
చదువుల్లో రాణించాలని
ప్రయోజకులు అవ్వాలని దీవెనలు ఇవ్వడం మొదలెడుతారు
రాక్షసవిలువలు మరిచి
మానవత్వ విలువలకై
తాపత్రయ పడుతుంటరు
కడుబీదలకు సైతం దానం చెయ్యని చేతులు
తొలి పండుగతోనే దానం చేయుటకు
తొందర పడతాయి
అబాలగోపాలం ఏ చిన్న
పొరపాటు చేసిన మళ్ళీ
చేయకూడదని
మంచిపనులు ఇప్పుడే మొదలెడుదాము అని
తొలిపండుగ ( ఉగాది )రోజే
ఒట్టేసుకుంటారు
ఇప్పుడే మొదలెడుదాము
ఇప్పుడే మొదలెడుదాము
అని శపదం చేసుకుంటారు
( ఉగాది సందర్బంగా రాసిన కవిత )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి