ఆటలసారు;- పెంబర్ల కిషోర్-6వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల-సిద్ధిపేట జిల్లా.-9704865816.
 ఒరేయ్ చరణ్! ఇవ్వాల పీఇటి సార్ వచ్చిండారా? ఏమోరా!కిషోర్! ఇంకా కనపడలేదు రా!  సార్ లేకపోతే బోర్ కొడుతుంది రా!మనకు ఆటల పీరియడ్ వచ్చిందంటే చాలు. సంతోషమౌతుంది.మనతో కలిసి మంచిగా మాట్లాడుతాడు.ఆటలు ఆడిపిస్తాడు అని కిషోర్ అంటాడు.నీకు ఎలాంటి ఆటలంటే ఇష్టం రా చరణ్!
నా కారా! వాలీబాల్ అంటే ఇష్టం రా! లిఫ్ట్ చేయొచ్చు,నెట్ మీదకెళ్ళి షాట్లు కొట్టొచ్చు,సర్వీస్ బాల్ ఇవ్వొచ్చు,సంటర్ఆడవచ్చు, కార్నర్ ఆడవచ్చు
అని కిషోర్ అంటాడు.
మన పీఈటి కూడా వాలీబాల్ బాగాఆడుతాడు కదరా! అని చరణంటాడు.ఔనురా మొన్న ఎగిరి షాట్ కొడితె రాముగాని తలకాయెకు తగిలి వాసిందిరా అని కిషోరంటాడు.
ఇంకా సార్ కు చాలా రకాల ఆటలు వస్తాయి!
జావలింగ్ త్రో, కబడ్డి, కోకో, రన్నింగ్,లాంగ్ జంప్,సెటిల్ బ్యాట్,ఇవన్నీ ఆడిపిస్తాడు.ఒరేయ్ చరణ్!సారు అమ్మాయిలకు కూడ ఆటలు నేర్పిస్తాడురా!
 ఔను.నేర్పిస్తాడు.
కుర్చిపరుగు, తాడు దుంకుడు, రొట్టె పెంక,చదరంగం ఆడిపిస్తాడు.
అందుకే పీఇటీ సార్ రాని నాడు ఏమి తోచదురా!
పాఠం విన్న తర్వాత  కొద్దిసేపు ఆడుకుంటే హాయిగా ఉంటుంది.సార్లు చెప్పే పాఠాలు కూడా మంచిగా అర్థమైతవి.అందుకే నాకు పీఇటీ సర్ అంటే ఇష్టం.
ప్రార్థన సమయములోసారు విజిల్ వేస్తే ఊరంతా వినపడుతుందిరా!
చెవులు గిల్లుమంటవి.
కంచుగంట సౌండ్ కంటే ఎక్కువ దూరం విబడుతది. నాకు డోలు,సైడ్రం కూడా నేర్పించిండురా!నేను పెద్దగయిన తర్వాత పీఇటీ అవుతానురా!
మరి నీవే మైతావురా చరణ్.నేను బాడీ గార్డు నౌతాను.ఇప్పటినుండే శరీరం ధృఢంగా చేసుకుంటాను.
అందుకే మనిద్దరం సారు చెప్పినట్లు వినాలి.మంచి వ్యాయామము చేయాలి.
సార్ లాగ మనం బలంగా తయారు కావాలి.ఏ జాతీయ పర్వదినం వచ్చిన మనకు ఆటలు ఆడిపిస్తాడు.గెలిచిన వారికి మెడల్స్ ఇప్పిస్తాడు.
అందుకే నాకు పీఇటీ సారంటే ఇష్టం.
పోదాంపద మన తెలుగు సారు తరగతికి
వచ్చినట్లున్నారు.
పద్యాలు చదవాలి. పదా అంటూ ఇద్దరు కలిసి తరగతి గదిలోకి వెళ్లారు.


కామెంట్‌లు