పరివర్తన :- బండి సాయిశివ-6వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-బక్రిచెప్యాల సిద్ధిపేట జిల్లా -9704865816.
 గట్లమల్యాల గ్రామానికి ఆనుకొని పెద్దడవి ఉండేది. అడవిలో చాలాజంతువులు ఉండేవి.చెట్టు పైన కట్లపాము, అడవిలో సింహం,చెరువులో మొసళ్లు ప్రాణస్నేహితులుగా ఉండేవి.ఒకరిని విడిచి ఒకరు ఉండేవారుకాదు.ఎవరికి ఏ ఆపద వచ్చిన దగ్గరుండి కాపాడుకునేవి.రోజు చెరువుగట్టున గలపెద్ద మర్రిచెట్టు క్రింద కూర్చొని భవిష్యత్తు గురించి కబుర్లు చెప్పుకునేవి.ఒకరోజు సింహం ఇలా అన్నది స్నేహితులారా!మనం ఈ అడవిని కాపాడుకోవాలి.
అడవిపచ్చగా ఉన్నట్లయితేనే మనం బ్రతకగలుగుతాం.చెరువులో నీళ్లు ఉంటాయి.మనకు కావలసినటువంటి పండ్లుదొరుకుతాయి అని సింహం అన్నది.ఇప్పుడిప్పుడే మన అడవిపై దొంగల కన్ను పడింది.అడవిని నరికి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు.మనం జాగ్రత్తగా ఉండాలి.దొంగలపై ఒక కన్నువేసి ఉంచాలి అని సింహమన్నది.సరే!అని పాము,మొసళ్లు అన్నాయి.
చాలా రోజులుగడిచాయి.భూమేశ్ ఏ జంతువు కంటబడకుండా అడవిలో ప్రవేశించాడు.మొసళ్ళు నివసించే చెరువు గట్టున గల మర్రిచెట్టును చూశాడు.గొడ్డలితో సగంవరకు నరికాడు.ఈ విషయాన్ని సింహం పసిగట్టింది.వెంటనే అతనిపైదాడిచేయబోయింది.భయంతో చెట్టుపైకెక్కాడు.ఈ విషయాన్ని పాము గ్రహించింది.అతనిని కరువబోయింది.వణుకుతూ
చివరి కొమ్మవరకు పారిపోయాడు.కొమ్మవిరిగి ఉగులాడుతున్నాడు.వెంటనే చెరువులోని మొసళ్ళు ఇతనిని పట్టుకుందామని పైకెగిరాయి.నా ప్రాణం కొద్ది సేపట్లో ఎలాగు పోబోతుంది.
చివరి ప్రయత్నంగా నన్ను కాపాడండిమీకు
జన్మజన్మలకు ఋణపడి ఉంటాన'ని వాటిని వేడుకుంటాడు.మొదటి సారి వచ్చినవు కాబట్టి నిన్ను ఏమి చేయము.చెట్టుదిగి వెళ్లిపొమ్మన్నాయి.
వాటి ఋణం తీర్చుకోవడానికి అడవికి కాపలా ఉంటాడు.భూమేశ్ పరివర్తనకు జంతువులు సంతోషించాయి.ఎండి పోయిన కట్టెలను అమ్ముకుంటు తన కుటుంబాన్ని పోషించు కుంటాడు.



కామెంట్‌లు