ఒక ఊరిలో రిత్విక అనే అమ్మాయి ఉన్నది.
తాను ఆరవ తరగతి చదువుకుంటుంది.
చక్కగా ఇంటిపనుల్లో అమ్మకు సహాయం చేస్తుంది. నాన్నతో కలిసి బావి కాడికి వెళ్లేది.
అక్కడ కూరగాయల చెట్లు,పండ్ల చెట్లు నాటేది.సమయానికి తయారై బడికి వెళ్ళేది. ఒకరోజు ఆదివారం వాళ్ళ నాన్న తోటి బావి కాడికి వెళ్ళింది.తను పెట్టినటువంటి చెట్లను చూసింది.చాలా మురిసిపోయింది.కానీ తనకిష్టమైన టమాట చెట్టు బక్క చిక్కి వాడిపోతుంది.
దాన్ని చూడగానే రిత్వికకు బాధ వేసింది.
టమాట చెట్టు ఎందుకువాడి పోతున్నదో అర్థం కాలేదు.అప్పుడు రిత్విక టమాట చెట్టు దగ్గరికి వెళ్లింది.టమాట చెట్టు ఎందుకు అట్లా బక్క చిక్కిపోతున్నావు.నిన్ను చూస్తే నాకు బాధ వేస్తుందని రిత్విక అన్నది.అప్పుడు టమాట చెట్టు!
ఏం చెప్పమంటావు రిత్విక.
అన్ని చెట్లను దూరం దూరం పెట్టావు.కానీ నన్ను మాత్రం వంకాయ చెట్టు కింద పెట్టావు.వంకాయ చెట్టు నీడలో నేను పెరగడంలేను.అందుకని వాడిపోతున్నానని చెప్పింది.
అది విన్న రిత్విక ఎలాగైనా టమాట చెట్టును కాపాడాలని మనసులో అనుకుంది.ఆలోచిస్తూ ఇంటికి వచ్చింది.రాత్రి అంతా ఆలోచించింది.
పొద్దున్నే లేచింది.బడికి రెడీ అయి సైకిలెక్కిపోయింది.రిత్వికకు మాత్రం ఆ టమాటా చెట్టుపైనే ఆలోచన ఉన్నది.ఆరోజు సైన్స్ సారు మొక్కల గురించి పాఠంచెప్పాడు.
మొక్కలను దగ్గర దగ్గర నాటకూడదు.వాటికి సూర్యరశ్మి అందక బక్కచిక్కి చనిపోతాయని చెప్పాడు.ఆ విషయం రిత్విక విన్నది.సాయంత్రం ఇంటికి వెళ్లింది.వాళ్ల నాన్న తోటి బావి వద్దకు వెళ్ళింది.వాడిపోతున్న టమాట చెట్టును పీకితే వేర్లు తెగుతాయని ఆలోచించింది.వంకాయ చెట్టును వేర్లతోటి పీకి వేరేచోట పెట్టింది.ఆనాటి నుండి టమాట చెట్టుపై సూర్యరశ్మి పడి,కాయలు, పండ్లు కాయసాగింది.అప్పుడు టమాట చెట్టు రిత్విక తెలివిని మెచ్చుకున్నది.ధన్యవాదాలు తెలిపినది.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి