నక్క మోసం:- డీకొండ హారిక-6వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల-సిద్ధిపేట జిల్లా -9704865816
 ఒక అడవిలో జిరాఫీ పాఠశాల నడిపిస్తుంది.అన్ని జంతువులు వచ్చి చదువుకుంటున్నాయి.
ఏనుగు చదువులో ముందుండేది.నక్క ఓర్వలేక పోయేది.తరగతిలో ఏనుగు వెనక కూర్చొని అనేక అల్లరి పనులు చేసేది.ఇవన్నియు ఏనుగేచేసిందని నక్క చాడీలుచెప్పి కొట్టించేది.ఏనుగు ఏమి అనక పోయేది.ఒకసారి ఏనుగు,నక్కఆటస్థలంలో కబడ్డి ఆడుకుంటున్నాయి.
నక్క అనుకోకుండ కాలుజారి కిందబడింది.ఏనుగే నన్ను నూకేసిందని సార్ కు చెప్పింది.
ఏనుగును కర్రతో జిరాఫీ సార్ కొట్టాడు.
తెల్లవారి ఏనుగు పాఠశాలకు రాలేదు.ఏమైందని సారు నక్కను అడిగాడు.మీరు కొట్టిన దెబ్బలకు జ్వరం వచ్చిందట సార్.అయ్యో!పాపం.వాళ్ల ఇంటికి పోదాం పదా! అంటు నక్కను వెంటబెట్టుకొని ఏనుగింటికి పోతుంది.ఏమైందమ్మ బడికి రాలేదు అని జిరాఫీ అడుగుతుంది.నాకు జ్వరం వచ్చింది అని ఏనుగుపిల్ల అన్నది.ఇదిగో!గోళీలు తెచ్చాను.వేసుకొని పాలు తాగు అని చెప్పి వెళుతుంది.ఎందుకు జ్వరం వచ్చింది అని
తల్లిఅడుగుతుంది.నక్క అబద్దాలు చెప్పి సారు తోటి కొట్టించింది అని చెప్పింది.
అలాగా!దానికి తగిన శాస్తి జరిగేటట్లు చేస్తాను.నీవు రేపటినుండి బడికి వెళ్ళు.తల్లి సీసీ కెమెరాలు తరగతిలో పెడుతుంది.
తెల్లారి ఏనుగు పిల్ల బడికి వస్తుంది.పాఠం వింటుంది.అప్పుడు నక్క మెల్లగా ఏనుగు వెనుక కూర్చుంటుంది.పాఠం మధ్యలో ఏనుగు లాగా అరిచింది.వెంటనే సారు ఏనుగు పిల్లా ఇటురా!ఏమిటా అరుపులు అని సారు బెదిరిస్తాడు.ఈ విషయాన్నంత సీసీ కెమెరాల్లో బంధించిన తల్లి సారుకు చూపెడుతుంది.సారు నక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు.తరగతి నుండి బయటికి వెళ్లగొడతాడు.నక్కవచ్చి నన్ను క్షమించండి సార్.ఇగ నుంచి చెడుపనులు చేయను సార్ అంటుంది.తన తప్పు తెలుసుకుంటుంది.తనలో వచ్చిన మార్పుకు అందరు సంతోషిస్తారు.



కామెంట్‌లు