చెడు అలవాట్లు:- దేవర శివతేజ-6వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల సిద్ధిపేట జిల్లా -9704865816
 తరుణ్,ధనుష్ ఎనిమిదవ తరగతి చదువుచున్నారు ఇద్దరు కలిసి రోజు బడికి వెళ్లేవారు.పరీక్షలో ఇద్దరికి మంచి ర్యాంకు వచ్చేది.అందరు గూడా వీళ్లిద్దరి లాగా చదువాలని సార్లనేవారు.ధనుష్ కు కాలేజికి వెళ్లని పిల్లలతో పరిచయం ఏర్పడింది.ఇతనితో సిగరేట్లు,గుట్కాలు తెప్పించుకునేవారు.కొద్ది కొద్దిగా ఇతనికి అలవాటు చేశారు.మత్తులో పడి బడి మరిచి పోయాడు.ఒరేయ్!తరుణ్!"నీ మిత్రుడు ధనుష్ బడికి ఎందుకు వస్తలేడ"ని సారు అడిగాడు.ఏమో సార్!నాకు తెలువదని తరుణ్ చెప్పాడు.ఎందుకు వస్తలేడోతెలుసుకోవాలని ధనుష్ వాళ్లింటికి వెళ్ళాడు.వాళ్లనాన్నను తరుణ్ అడిగాడు.అప్పుడుతండ్రి"రోజు నీతోనే కదా!బడికి వచ్చేద"ని అన్నాడు.సాయంత్రం కొడుకురాగానే
”ధనుష్ ఆగరా!ఎక్కడినుంచి వస్తున్నావ"ని తండ్రి అడిగాడు.బడినుండి వస్తున్నాను నాన్న అని అబద్దం చెప్పాడు.సరే అని ఊరుకున్నాడు.రాత్రి బాగా ఆలోచించాడు తండ్రి.మరునాడు ఉదయం కొడుకును బడికి పంపాడు.అతనికి కనబడకుండా వెనుకాలే తండ్రి పోతున్నాడు.కొడుకు దుకాణానికి వెళ్లి సిగరేట్ డబ్బా,గుట్కాలు కొనుక్కొని వాళ్ల దోస్తుల దగ్గరికి వెళ్ళాడు.ఇదంతా తండ్రి గమనించాడు.నా కొడుకు ఇలా చెడు అలవాట్లకు బానిస అయ్యాడని బాధపడ్డాడు.వెంటనే తరుణ్ ను కలిశాడు తండ్రి.మావాడి విషయాన్ని క్లాస్ టీచర్ కు
తెలుపమన్నాడు.ఎలాగైనా ధనుష్ ను మార్చాలని అనుకున్నారు.ఈసంవత్సరంప్రతిపాఠశాలకు
డిజిటల్ టీవీలు వచ్చినవి.పాఠాలన్నీ టీవీలో చూపిస్తున్నారు.మరునాడు ధనుష్ ను తోలుకొని తరుణ్ బడికి వచ్చాడు.ఆరోజు గుట్కా,సిగరేట్లకు బానిసై క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారి గురించి చూపించారు.ధనుష్ లో ఏదో తెలియని భయం మొదలైంది.నాకు క్యాన్సర్ వస్తుందా!అని వణికిపోయాడు.ధనుష్ తనుచేసిన తప్పును సారు ముందు ఒప్పుకున్నాడు.ధనుష్ లోని మార్పుకు తనుష్,తల్లిదండ్రులు,సార్లు సంతోషించారు.



కామెంట్‌లు