తెలివైన అమ్మాయిలు :- జక్కుల శరణ్య-6వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల.-సిద్ధిపేట జిల్లా -9704865816.
 అనంతసాగర్ లో అనన్య, శరణ్య, శ్రీ పూజ, హారిక నలుగురు స్నేహితులు.రోజు నలుగురు కలిసి బడికి వెళ్లేవారు.తరగతిలో సార్లు చెప్పే పాఠాలను ముందే చదువుకొచ్చేవాళ్ళు.సార్ పాఠం చెప్పగానే టకటక సమాధానాలు చెప్పేవారు. తోటి పిల్లలకు పాఠం అర్థంకాకపోతే బాధపడేవారు. విశ్రాంతి సమయంలో వాళ్లకు చదువు చెప్పేవారు. వెనుకబడిన పిల్లలు లేకుండా చేసేవారు.అందరికీ కూడా వీళ్లు అంటే ఇష్టం.పాఠశాలలో ఏ ప్రోగ్రామ్స్ అయినా వీళ్లే ముందుండేవారు.ఎజెండా తయారు చేసుకునేవారు. ప్రోగ్రామ్స్ చక్కగా నిర్వహించేవారు.వచ్చిన ఆఫీసర్లు అందరూ ఈ పిల్లల తెలివిని చూసి మెచ్చుకునేవారు. భవిష్యత్తులో వీళ్ళు  ప్రయోజకులుగా అవుతారని చెప్పేవారు.ఈ నలుగురి పిల్లల్లో మరింత ఉత్సాహం పెరిగింది.ఎవరు బడికి రాకున్న వారి ఇండ్లకు వెళ్లేవారు. మీ పిల్లలను బడికి పంపించాలి. చదువుకోకపోతే భవిష్యత్తులో కష్టాలు ఉంటాయి.అందుకే నచ్చజెప్పి పిల్లలను బడికి తీసుకొచ్చేవారు.
పాఠశాలకు దసరా పండుగకు సెలవులుఇచ్చేవారు.ఉపాధ్యాయులు విహార యాత్రలకు తీసుకెళ్లేవారు.ఈ నలుగురు అమ్మాయిలు కూడా వెళ్లేవారు. అక్కడ సార్లు చెప్పిన ప్రతి విషయాన్ని నోటు బుక్కులో రాసుకునే వారు.యాత్రలకు రాని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేవారు.ఊరిలో  మీటింగులు జరిగేవి.పెద్దలు చెప్పే మంచి విషయాలను నోట్ బుక్కు లో రాసుకునేవారు.ఎవరైన స్టేజి మీద కొచ్చి మాట్లాడాలి.
అన్నప్పుడు నలుగురు అమ్మాయిలు వెళ్లి ఉపన్యాసం ఇచ్చేవారు.అందరి చేత ప్రశంసలు పొందేవారు.
వారి ఇళ్లల్లో నలుగురు అమ్మాయిల గురించి చెప్పేవారు.వారి లాగ మీరు చదవాలని తమ పిల్లలకు చెప్పుకునేవారు.ఈ నలుగురు అమ్మాయిలు డాక్టర్లు కావాలని అనుకున్నారు.అమ్మానాన్నలు ఇచ్చేడబ్బులతో పుస్తకాలు కొనుక్కొన్నారు.పట్టుదలతో పెద్ద చదువులు చదివారు. అందరు డాక్టర్లు అయ్యారు. మంచి సేవలు అందించారు ఊరికీ ఆదర్శంగా నిలిచారు.



కామెంట్‌లు