పచ్చ పచ్చని పైరులతో
లేత మామిడి చిగురులతో
కమ్మని కోకిల రాగాలతో
నవ వసంతం వచ్చింది.
ప్రకృతి అందాలతో
పల్లె తల్లి మురిపాలతో
మిల మిల మెరిసే వేప పూలతో
తెలుగు వారికి నూతన సంవత్సరం వచ్చింది.
ఇంటిలోని వారంతా
కొత్త కోరికలతో ఆనందంగా
ఆరు రుచులతో పచ్చడ చేసి
ఆనందంగా తాగుతారు.
దేవుడికి దండం పెడతారు
మనసులోని కోరికల తీరాలని
ఆరోగ్యంగా అందరూ కలిసి ఉండాలని.
దేవాలయములకు వెళ్లి
పంచాంగ శ్రవణం చేస్తారు
పంటలు బాగా పండాలని
అందరూ బాగుండాలని కోరుకుంటారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి