అమ్మంటే తొలి పలుకు
ఉగాది అంటే తొలి వెలుగు
ఊరంతా పండుగ మనసంతా నిండుగా పచ్చని ఆకుల తోరణాలతో
ఇంటింటా సంబరాలతో
ఉగాది వచ్చింది
పల్లె ప్రకృతిని తెచ్చింది
పొద్దున్నే లేస్తుంది కోయిల,
కుహు కుహు రాగాలతో
అమ్మ చేసే వంట తీయదనం
ఉగాది పచ్చడి కమ్మదనం
మనస్పర్ధలు లేకుండా
ఆరోగ్యాలను పంచే ఉగాది
మామిడికాయ వగరుతో
ఉగాది పండుగ తీపి తో
ఆరు రోజులను కలిపినా ఆనందం
కష్టసుఖాల్లో పాలుపంచుకుందాం
అందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షల
🌹🌹🌹🌹🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి