అనాథలైన రవి,రమ్య వీరు అన్నా చెల్లెళ్లు.ఆకలి వేస్తే అన్నం దొరికేదికాదు.పడేసిన పాతబియ్యపు సంచులను జబ్బకు వేసుకొని ఊరంతా తిరిగేవారు.రోడ్ల పక్కన తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్,కవర్స్ ఏరుకొనేవారు.సాయంత్రం వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో ఆ పూటకు అన్నం తినేవారు.ఒక్కొక్క రోజు అన్నమే దొరికేది కాదు. పస్తులతో గడిపేవారు.
ఒకరోజు పాఠశాల వైపు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటున్నారు.అటు ప్రక్కగా ఇద్దరు అన్నాదమ్ముళ్లు సతీష్, నితీష్ స్కూల్ డ్రెస్,బ్యాగు వేసుకొని బడికి వెళ్తున్నారు.
రవి,రమ్యను చూసి"నితీష్! ఛీ!ఛీ!మురికి పిల్లలు.వాళ్లను ముట్టుకోకు"అని అన్నను అంటాడు.అప్పుడు రవి మేము మీలాగా ధనవంతులం కాకపోవచ్చు.కానీ మా పరిస్థితి వల్ల ఇలా అయ్యాం.లేకపోతే మీలాగా మేము కూడా బడికి వెళ్లి చదువుకునే వాళ్ళమని హెచ్చరిస్తాడు.వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు.రమ్య వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చేసరికి చీకటి పడింది.తినడానికి ఏమి దొరకలేదు.పక్కింటి వారింటికి వెళ్లి అన్నం అడిగింది.
లేదనగానే రమ్య ఏడ్చుకుంటూ అన్న దగ్గరకు వెళ్ళింది.రవి 'ఎందుకు ఏడుస్తున్నావ్ రా! చెల్లి' అని అడిగాడు.ఈ ఒక్క పూట ఆకలికి ఓర్చుకో.రేపు ఎక్కడనైనా పని చూస్తాను.ఆ పనికి మనం రోజు వెళ్దాం. అప్పుడు రోజు కడుపునిండా అన్నం తిందాం అని ధైర్యం చెప్పాడు.వారిద్దరు ఆకలితో మంచినీళ్లు తాగి
నిద్రపోయారు.
మరుసటి రోజు ఇద్దరు హోటల్ యజమానిని కలిసారు.ఏమైనా మాకు పని ఇప్పియ్యండి సార్ అని అడిగారు.ఏ పని చేస్తారు మీరు.చూస్తె చిన్న పిల్లల్లా ఉన్నారు అని అన్నాడు.ఏ పనైనా చేస్తాం అని రవి,రమ్యలు అన్నారు.
సరే కొన్ని రోజుల వరకు తినుకుంటూ ఇక్కడే ఉండండిఅని అన్నాడు.
ఒకరోజు హోటల్ యజమాని వీరిద్దరిని పిలిచాడు.
"ఎందుకమ్మా మీకు ఈ పరిస్థితి చదువుకోవడం లేదా!" అని అడిగాడు.లేదండి! మాకు అమ్మానాన్నలు లేరు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మిమ్మల్ని నేను చదివిస్తాను.
బడికి పోయి వచ్చిన తర్వాత మీకు చేతనైన పని చేయండి అని యజమాని అంటాడు.
ఇద్దరు సంతోషంగా ఎగిరి గంతులు వేస్తారు.ఆరోజు నుండి ఇద్దరికి పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, కొనిచ్చి బడికి పంపాడు.
వీరిద్దరూ కష్టపడి చదువుకుంటున్నారు. చూస్తుండగానే రవి,రమ్య పెద్దగయ్యారు.వీరిద్దరికీ ఉద్యోగాలు దొరికాయి.
చాలా సంతోషపడ్డారు.
యజమాని ఆశీస్సులు పొంది ఉద్యోగాల్లో చేరిపోయారు.
చిన్నప్పుడు స్కూల్ కు వెళ్తున్నప్పుడు ఎగతాళి చేసిన సతీష్, నితీష్ కలిశారు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో జల్సాగా తిరిగారు.చదువును అశ్రద్ధ చేశారు.ఎక్కడ పరిస్థితులు అనుకూలించలేదు.చివరికి రవి పనిచేస్తున్న ఆఫీస్ కు వచ్చారు.రవి వారిని గుర్తుపట్టాడు.చూశారా!మిత్రులారా!విధి ఏవిధంగా మారుస్తుందో తెలిసిందా!అనగానే సిగ్గుతో ఆ మిత్రులు తలదించుకున్నారు.చివరికి రవి వాళ్ల ఆఫీసు లోనే వారికి
గుమాస్తాలుగ పని పెట్టించాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి