మంచి మిత్రుడు:- ఎల్ . చందన 8 తరగతి-ప్రభుత్వబాలికోన్నత పాఠశాల సిధ్ధిపేట
 *ఒక అడవిలో చిలుక;  నెమలి ఎంతో స్నేహంగా ఉండేవి. 
ఒకరోజు నెమలి చిలుకను నీ ముక్కు ఎంతో ఎరుపుగా ఉంది" అని అంది. అది విన్న చిలుక నీ'పింఛం అంటే ప్రజలకు ఎంతో ఇష్టం"అని అంది. అదే అడవిలో ఒక కాకి కూడా ఉంది. అయితే చిలుకకు, నెమలికి కాకి అంటే అయిష్టం. ఒకసారి చిలుక జబ్బున పడ్డది. కాకి కొన్ని పళ్ళు తెచ్చి చిలుకకు ఇచ్చింది. వాటిని తీసుకున్న చిలుక కాకికి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. కాకి చాలా బాధపడింది.
ఒకరోజు నాట్యం చేస్తున్న నెమలిని తినేందుకు పెద్ద పులి వచ్చింది .  దీన్ని గుర్తించిన కాకి కావు కావు అంటూ అరవడంతో వందల సంఖ్యలో కాకులు గుమ్మిగుడి పెద్దపులిని తరిమి వేశాయి.
ఆ మరుసటి రోజు చెట్టుపై నిద్రించుతున్న చిలుకను తినేందుకు ఒక గద్ద ప్రయత్నించడంతో మళ్లీ కాకులన్నీ కలిసి దానిని కూడా తరిమివేశాయి 
దాంతో చిలుక నెమలి కాకి గొప్పతనాన్ని గుర్తించాయి. అప్పటినుండి ఈ రెండు కాకితో స్నేహం చేయడం మొదలు పెట్టాయి. 

నీతి:-  మూడు ఎంతో స్నేహంగా ఐక్యమత్యంతో జీవించాయి.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Exllent