విశ్వావసు ఉగాదిలక్ష్మికి స్వాగతం..!;- కవి రత్న-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్-చరవాణి...9110784502
"వసంతం"
వర్ణాల విందై విరిసే వేళ..!
మామిడాకుల
మంగళ తోరణాలతో...
పచ్చని పంటలతో...
నూతన వస్త్రాలతో...
ఘుమఘుమలాడే వంటలతో...
తెలుగు లోగిళ్ళు మురిసే వేళ..!

పచ్చని ప్రకృతిశోభకు పరవశించి...
కొత్త చిగురులను ఆరగించి...
కొమ్మల్లో కోయిలమ్మలు
కుహూ కుహూ అంటూ...
ఆనందగీతాలను ఆలపించే వేళ..!

"విశ్వావసు"
"ఉగాదిలక్ష్మి వచ్చి"...
"ఉగాది పచ్చడి" తెచ్చి
"షడ్రుచుల హారతి నిచ్చి...
వినిపించు...జీవిత సత్యాలెన్నో...
జీవనసంగీతం స్వరపరచి దివ్యగాథగా..!

"ఉగాది ఉత్సవ వేడుకల్లో "...
తిథి వార నక్షత్ర రాశులతో...
దేశ రాష్త్ర నేతల జాతకాల్ని చూస్తూ...
ఆదాయ వ్యయాల్ని...అంచనా వేస్తూ...
శ్రీ "విశ్వావసు" నామ సంవత్సర ఉగాది
సిరిసంపదలను.‌‌..సకల శుభాలను...
సుఖశాంతులను అందించాలని...
ఆశతో భవిష్యత్ దర్శనం చేస్తూ...
"పంచాంగ కర్తలు" వినిపిస్తారు
"పంచాంగ శ్రవణం"వీనులవిందుగా...!

"ఉగాది పర్వదినాన"...
"కవి సమ్మేళనాలు" సాగు
అంబరాన్ని తాకే సాహిత్య సంబరంగా...
కవుల కలాల్లో విరియు నవవసంతాలు..!

విశ్వశాంతిని...
అందరికీ అఖండ విజయాలను...
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను...
తెచ్చే ఇచ్చే శ్రీ విశ్వావసు"
నామ సంవత్సర ఉగాది లక్ష్మికి...
స్వాగతం...సుస్వాగతం...శుభస్వాగతం...
తెలుగు భారతికిదే...నా అక్షర హారతి....!

(అందరికీ నూతన తెలుగు
ఉగాది పర్వదిన శుభాకాంక్షలు)



కామెంట్‌లు
Poolaiah kavi kukatlapalli చెప్పారు…
వేదాంత సూరి గారికి నా ఉగాది కవితను అందంగా అలంకరించి అందించినందుకు వెలుగులోనికి తెచ్చినందుకు వందనం అభివందనం ... షడ్రుచులతో... ఊరించే వినోదాల విందును... మీరు కోరుకున్న విజయాలను ఆశించిన ఆరోగ్యాన్ని ఆయుష్షును అష్టైశ్వర్యాలును వరాలుగా అందించాలని కోటి కొత్త రాగాలు ఆలపించే కోయిలమ్మ మీ ఇంటికి అతిథిగా రావాలని మీ ఇంటిని కోటి ప్రభల వెలుగులతో నింపాలని శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానిస్తూ... మీకు మీ
కుటుంబ సభ్యులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందిస్తున్న... మీ ఆత్మీయ సాహితీ మిత్రుడు పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్