నేస్తమా!:- యలమర్తి అనూరాధ -హైదరాబాద్-9247260206
 రోజంతా సెల్లుతోనే 
నీ సహవాసమా? 
శాంతి దూతనైన 
నన్నే మరిచితివా? 
వేసవి ఎండల దాహం తీరనిది 
కాస్త మంచినీళ్లు మా కోసం పెట్టండి 
ప్రకృతి పరిరక్షణ కూడా మీ బాధ్యతే
ఆ పనిలో కాస్త శ్రద్ధ చూపండి 
విలువైన సమయాన్ని వృధా చేసే 
ఈ హస్త భూషణాన్ని దూరంగా నెట్టండి 


కామెంట్‌లు