ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు ,-9441058797
         ఫలశ్రుతి.
121.
విష్ణువా! వెన్న తిన్న వెన్నుడా! నీవేగా నా సర్వస్వమే!

రోచిష్ణువా! ప్రపంచప్రకాశమా! కన్నుల నివాసమే! 

సహిష్టువా! ఓర్పున్నవాడా!
దర్శనీయం  దరహాసమే!

భక్తబంధూ! కారుణ్యసింధూ! వాంఛితార్థం అనుగ్రహమే!

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
122.
బాహ్యం ఎంత వెతికినా!
 మాకిక దొరకని వాడవే! 

రహాస్యమే జనాంతరంగాన ,
     సంసిద్ధుడవై ఉన్నావే!

 దృష్టి అంతర్ముఖం చేయ, 
నీవొక్కడివే సమర్ధుడివే!

నా హృదయాన నిన్ను, దర్శించగా తోడేనాడు వీడవే! 

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
123.
ధరణి రెండే ,ఆచరించ,
 ధర్మమే, రక్షించ దైవమే!

ధర్మాచరణ, యుగయుగాల, మానవాళి కర్తవ్యమే!

దైవ నిర్ణయం శాసనమే, సర్వజన శిరోధార్యమే! 

దైవం సాక్షిగా ధర్మాచరణే, జీవితాన ఆదర్శమే! 

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు