అనగనగా బంకా పురం అనే ఊరుండేది. ఆ ఊరు చెరువు గట్టుమీద ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు కింద చీమల పుట్ట ఉంది. ఒకరోజు చీమ ఆహారం కోసం బయటకు వచ్చింది. ఎక్కడ చూసినా ఆహారం దొరకలేదు. చిన్నగా ఒక ఇంట్లోకి దూరింది. ఆ ఇంట్లోని వంట గదిలో ఉన్న చక్కెర వాసన పసిగట్టింది. చీమకు చక్కెర అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. మొత్తం మీద చీమ చక్కెర ఉన్న డబ్బా దగ్గరికి వెళ్ళింది.
చీమ రాకను కనిపెట్టిన చక్కర ఆ చీమను ఎలాగైనా యజమాని వచ్చేవరకు ఆపాలని చిట్టి చీమతో ఇలా పలికింది. చీమ చీమ ఓ చిట్టి చీమ! నీకు స్వాగతం. నన్ను తినడానికి వచ్చావు కదా. నిజంగా నా అదృష్టం నన్ను తింటే నాకు కూడా పుణ్యం వస్తుంది. ఒక మంచి ప్రాణికి ఆహారంగా అవుతున్నందుకు నా జన్మ ధన్యమైనట్లే. అయితే ఒక కండిషన్ అంది.
"అయితే ఏమిటో చెప్పు నీ కండిషన్ అంది" చిట్టి చీమ. నన్ను తినాలంటే నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాలి అంది చక్కెర. ఓ... అంతేనా! అట్ల ప్రశ్న అడుగు ఇట్లే జవాబు వెంటనే చెప్పేస్తాను అడుగు అంది చీమ .
అప్పుడు చక్కెర చీమతో "ఇప్పుడు మనము ఉన్న వంటగది పొడవు వెడల్పు ఎంత ఉంటుందో చెప్పగలవా? " అని అడిగింది.
చిట్టి చీమ "ఓ గింతేగా...! ఇప్పుడే కొలిచి చెప్పేస్తాను అంది".
వెంటనే పొట్టి చీమ ఆ వంట గది పొడవు ,వెడల్పు కొలవడం మొదలుపెట్టింది. అట్లా కొలుస్తుండగా.. కాసేపటికి ఆ ఇంటి యజమాని వచ్చేసాడు. అలసిపోయి వచ్చిన ఆజమాని టీ త్రాగడానికి వంటగదిలోకి వెళుతుండగా యజమాని కాలు కింద పడి చీమ చనిపోయింది.
అది చూసిన చక్కెరకు ప్రాణం లేచి వచ్చింది. ఊపిరి పీల్చుకుంది. చీమ బారి నుండి బయటపడడం అదృష్టంగా భావించింది. కొద్దిసేపటికి యజమాని సరాసరి స్టవ్ వెలిగించి టీ కొరకు నీళ్లు వేడి చేశాడు. పాలు పోసి కాసేపటికి చక్కెరను అందులో కలపాడు. అది చూసిన చక్కర బోరు బోరున ఏడుస్తూ చీమలాగే నాకు కూడా ఆయుషు అయిపోయింది అనుకుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి