బాలలం బడి పిల్లలం
అమ్మ నాన్నల ముల్లెలం
ఆనందాల వెలుగులం
పాల బుగ్గల మొగ్గలం
ముద్దులొలుకు చిన్నలం
పాఠశాలలో చేరినం
చదువులు బాగా చదివెదం
గురుదేవుళ్ళకు మ్రొక్కెదం
ఆటలు ఎన్నో ఆడెదం
ఆనందంగా ఉండెదం
కలిసి మెలిసి బతికెదం
లేత గులాబీ పువ్వులం
రోజూ చిందే నవ్వులం
గాంధీ నెహ్రూ వారసులం
రేపటి భారత పౌరులం
భవితవ్యానికి వెలుగులం
నింగిలో మెరిసే చుక్కలం
హరి విల్లును తాకే చినుకులం
కులమత భావన కూల్చేదం
మమతా సమతా పంచెదం
మేమే మేమే పిల్లలం
నిత్యం వెలిగే మల్లెలం
భారతమాత బిడ్డలం
రేపటి తరం వారసులం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి