ప్రేమ పైన జీవిత గణిత చక్రం:- మడ్డు తిరుపతి రావు -గణిత అవధాని& టీచర్-బూరగాం*కంచిలి* శ్రీకాకుళం-9491326473

 నా ఉద్దేశ్యంలో ప్రేమ  అర్థం రెండు విధాలుగా ఉంటుంది.మొదటిది తల్లీదండ్రులు వారి పిల్లల పైన,ఉపాద్యాయులు వారి విద్యార్దులు పైన, పక్షులు,జంతువులు వాటి పిల్లలపైన,మహోన్నతమైన వ్యక్తులు సమాజం పైన, ఎంతో అభిమానంతో,ఆప్యాయతతో,అనురాగాలుతో చూపేది మొదటిది ఐతే,ఇక రెండోది తెలిసి,తెలియని వయస్సులో పరిచయంతో ప్రారంభమై,స్నేహంతో ఒకటై,చివరకు ఆకర్షణకు గురియై,ఎక్కడ వరకు వెళుతుందో తెలియనిది రెండో ప్రేమ.ఈ ప్రేమ పైన గణితంలోని అక్షరాల సుముదయంతో ఇమిడి యున్న కవిత...ను చూద్దామా రండి.
స్త్రీ అనే ఒక అక్షరం కోసం,
ప్రేమ అనే రెండు అక్షరాలు పేరుతో,
చదువు అనే మూడు అక్షరాలను విడిచి,
జీవితము అనే నాలుగు అక్షరాలను మరచి,
తల్లిదండ్రులు అనే ఐదు అక్షరాలు వారిని బాధపరచి,
ప్రాణ స్నేహితులు అనే ఆరు అక్షరాల వారి సహాయంతో పారిపోయి,
సుఖ సంసారములు అనే ఏడు అక్షరాలతో కొన్నాళ్ళ సంతోషం పొంది,
వరకట్న వేధింపులు అనే ఎనిమిది అక్షరాలతో గొడవలు ప్రారంభమై,
ఆత్మ హత్య–ఆత్మ రక్షణ అనే తొమ్మిది అక్షరాలకు అలవాటు పడి,
జీవన చదరంగ చక్రము అనే పది అక్షరాల సుడి గుండంలో చిక్కుకుంటున్నారు.

కామెంట్‌లు