ఓ దేవా దేవా:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
దేవా దేవా ఓ దేవా
అనుగ్రహించారవా
నీవే దిక్కని అన్నం
నిన్నే నమ్ముకున్నం

దేవా దేవా ఓ మహదేవా
సర్వంతర్యామి నువు కావా
మము బ్రోవగ నీవిక రావా
మా సర్వస్వం నీవే కావా

దేవా దేవా మా మహాదేవా
జగదానందవు నువు కావా
మా లోగిలిలోకి నువు రావా
మా లోకుల రక్షించగా లేవా

దేవా దేవా మా సహదేవా
మా సందేహం తీర్చగరావా
చేతుము నిత్యము మీ సేవా
మోక్షం ఇవ్వగా నీవిక రావా

దేవా దేవా ఓ మా మహదేవా
మీ మాయలు చూపగల రావా
మా కంటి పాపవు నువు కావా
మా ఇంటికి వెలుగులు తేవా

ఓ దేవ దేవా మా మహాదేవా
మమత చూపగ నీవు రావా
 మామనసు నిండా ఉన్న నీవు
 మము మాయ చేసి పోయినావు 

ఓ దేవ దేవా మా మహాదేవా
మా కనులకు కనిపించరావా
మేము కాంచలేక నిదురూపం
కలిగే ఎందుకు మాకు శాపం 


కామెంట్‌లు