జవానులం మేము జవానులం
మా భారతదేశపు జవానులం
మా దేశం సరిహద్దులో మా నివాసం
ప్రతి పొద్దు మృత్యువుతో మా సహవాసం !
జవానులం మేము జవానులం
యువ జవానులం నవ జవానులం
శత్రుసేన ఆరా తీయు జవానులం
రాత్రి పగలు పహరా కాయు జవానులం !
జవానులం మేము జవానులం
అమరవీర ధీరశూర జవానులం
శత్రుమూకల ఆయువు తీయు జవానులం
మాతృదేశం సేవ చేయు జవానులం !
జవానులం మేము జవానులం
కలియుగ ఆకలియుగ జవానులం
మా భరతప్రజల క్షేమం మా ధ్యేయం
వారికోసం మేం రచిస్తాం ఓ అధ్యాయం !
జవానులం మేము వీరజవానులం
సమరం సాధన చేసేటి జవానులం
అమరం వాదన వినేటి ధీర జవానులం
శత్రు మూకల అణచివేసేటి జవానులం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి