పంట సిరి పిల్లలం (బాలగేయం)
------------₹₹₹₹₹₹₹------------------
వరినాట్లు వేసేటి రైతులం
కరిగట్ల పనిచేసేటి కూలీలం
మేమంతా వెళ్లి చేస్తాం సేద్యం
మా నేలతల్లికి ఇస్తాం నైవేద్యం !
కలసిమెలసి దున్నుతాం పొలం
అలసిసొలసి పొందుతాం ఫలం
సేద్యం మెలకువలను నేర్చుకున్నం
అసాధ్యమన్నవి వదిలించుకన్నం !
కృత్రిమ ఎరువులకు మేం దూరం
కంపోస్టు ఎరువుల పైనే మా భారం
ఆరోగ్యదాయక ధాన్యం అందిస్తాం
మా మహాభాగ్యమని స్పందిస్తాం !
పంటలో కలుపుమొక్కల పీకేస్తాం
ఇంటిలో పెనుచిక్కుల ఓకే చేస్తాం
అప్పుల ముప్పుల వాకప్ చూస్తాం
తప్పుల ఒప్పుల మేకప్ మేంవేస్తాం
సక్రమంగా మా పంటశిస్తు చెల్లిస్తాం
పంటవృధ్ధి పైనే మేం మా కన్నేస్తాం
పండిన పంటంతా మేం అసాంతం
మాఇంటి ధాన్యాగారంకు చేరేస్తాం !
మేం రైతే రాజని ఇక అనిపిస్తం
మారైతు బజారులను మురిపిస్తం
కష్టించే పనివారికి మేం విలువిస్తం
మానినాదం దేశమంతా వినిపిస్తం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి