రేపటి జగజ్జేతవు నువ్వే: - అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748487
]ఓచిట్టిపాపా !
ఓ చిన్నారి పాపా!
నీలక్ష్యమెప్పుడు ఉన్నతంగా ఉండాలి
 నువ్వెగరేసే పతంగమే అందుకు సాక్ష్యం
నీది గాలివాటు ప్రయాణం కావొద్దు 

దృఢసంకల్పం, కృషి పట్టుదల
నీ లక్ష్యసాధనకు సోపానాలు

ఆ ఆకాశపు అంచుదాకా ఎగరేయి 
నీ పతంగం
ఆనందాతిశయం నీ మోమున చూడాలి
ఈ అమ్మమురవాలి
రేపటి జగజ్జేతవు నువ్వై 
ఈ తల్లికి మాతృభూమికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాలి
ఆడపిల్లలు  అబలలుకాదు
 సబలలని రుజువు చేయాలి
----------------------


కామెంట్‌లు