ఆడవారిని
చూడొద్దు అబలగా
ఆడవారిని చూడాలి సబలగా
అపరశక్తిశాలి
ఆదిపరాశక్తి
అమ్మగా
అక్కా చెల్లెళ్ళుగా
అత్తమ్మ, నానమ్మ
అమ్మమ్మ ఆమ్మమ్మలు గా
పెనవేసుకున్న ఆత్మీయ బంధాలు
ఆడవారు కాదు ఆకులు - పిడిబాకులు
ఆడవారు కాదు నిస్తేజులు, నిస్సహాయులు
ఆడవారు అనంతచైతన్యశీలురు
త్యాగధనులేగాక
సహసవంతులు
రాణి రుద్రమలు
ఝాన్సీ లక్ష్మీబాయిలు
మగువమాంచాలలు
డొక్కా సీతమ్మలు
ఘంటం పట్టి కావ్యాల్నిలిఖించిన తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్కలు
కుమ్మరి మొల్లమాంబలు
తరిగొండ వెంగమాంబలు
భక్త మీరాబాయిలు
ముద్దుపళనిలు
రంగాజమ్మలు ఆస్థాన కవయిత్రులు
స్త్రీలకై అనునిత్యం పోరాడిన మల్లాది సుబ్బమ్మలు
ఆంగ్ సాంగ్ సూకీలు
మయన్నార్ ఉద్యమనేత
ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా
ఇందిరా గాంధీలు
భారతదేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీలు
సారా వ్యతిరేక ఉద్యమంలో పతాకస్థాయిలో పోరాడిన దూబగుంట రోశవ్వలు
దొరలు దేశ్ ముఖ్ లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ లు
ఎన్నని చూపను చరిత్ర నిండుగా
దండిగా
స్త్రీలే జయకేతనమెగరేస్తుంటే
చరిత్రమరుగునున్న
మహిళలు ఎందరో మరెందరో
(దురహంకారులైన పురుషులపదఘట్టనలక్రిందనలిగినదెందరో..! ?అమరులైనదెందరో...!?)
అందరి వందనాలు
స్త్రీమూర్తుల వైభవం:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి