కవులుఎక్కడైతేసామాజిక వెనుకబాటుంటుందో అక్కడ
చైతన్య గీతమవుతాడు
ఎక్కడైతే కులమతాల కుమ్ములాటలుంటాయో!?
అక్కడ సమానతను ఉద్భోదిస్తాడు.
ఎక్కడైతే వంచన పీడన ఉంటుందో ?
అక్కడ పిడికిళ్లు బిగిస్తాడు.
రొమ్ము విరిచి ముందుకేగుతారు
జీనాహైతో లడ్నాసీఖో
అని అంటూ గట్టిగా నినదిస్తారు
ఎక్కడైతేశోకముంటుందో?! అక్కడ ఓదార్పుగీతమౌతారు.
దాని మూలాన్ని కూకటివేళ్లతో సహా తొలగిస్తారు
ఎక్కడైతే అవిద్య, అజ్ఞానం ప్రగతిశూన్యత ఉంటుందో అక్షరాయుధమౌతారు
ఎక్కడైతే ఈర్ష్య అసూయలుంటాయో!?
అక్కడ పరోపకారం ఆత్మసంతృప్తిని
ఐకమత్యాన్ని పాదుగొల్పుతారు.
కవులు ప్రపంచంలో
ఏమూల
ఏం జరిగినా?!
విశ్వమానవ ప్రేమనుచాటుతారు.
మేమున్నమంటూభరోస నిస్తారు
కవులు విభిన్న సాహితీ ప్రక్రియల్లో కృషిచేసిన సామాజిక కవితాసేద్యగాళ్ళు
సమాజిక హిత్తైషులు
కవులు ప్రజాస్వామిక విలువలపట్ల గౌరవం పెంపొందించువారు
సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడేవారి పీచమణచేవారు
కవులు ప్రజలెన్నుకొనని ప్రజాప్రతినిధులు
నిరంతరం సాహితీ వ్యవసాయం చేయు కలంయోధులు
కవులకు కవిత్వం తీరని దాహమే
సకలమానవాళి ఈ భూమ్మీద ఉన్నంతకాలం కవులు కవిత్వమై వర్థిల్లుతారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి