అధికారమే పరమావధిగా
అడ్డదారిలో ఎన్నికల్లో గెలుపు కోసం ఆరాటపడుతున్న
మోసగాళ్ళు
ఆచరణ సాధ్యం కాని
హామీలతో ఓటర్లకు నిత్యం మహేంద్రజాలంచూపుతున్న
రాజకీయ వ్యాపారులు
అధికారంలోకి రాగానే
అన్ని వ్యవస్థలను అవినీతిలో
ముంచి ప్రజాస్వామ్యాన్ని నియంత పాలన గా మార్చే
అపర రాజకీయ చాణక్యులు
ఒక్కసారి అవకాశం ఇవ్వాలని
ఒంగి ఒంగి దండం పెట్టి గెలుపు
గుర్రమెక్కగానే నాయకుడై
అటుపిమ్మట (వి) నాయకుడై
ప్రజల గోడు పట్టని పరమహంసలు
ఓటప్పుడిచ్చినమాట వట్టిమాటేనని ఓటరు గుర్తెరిగే
లోపే మళ్ళీ ముందస్తు ఎన్నికలు
ఇక్కడ ఓడేదెవరుఓటరేగదా!?
ఈ చిన్న కిటుకు తెలియక ప్రజలు ప్రతిసారిఎన్నికల్లోనూ
ఓడిపోతున్నవైనం
ఓటర్లు చైతన్యవంతులు కానంత కాలం అభ్యర్థులు
నాటుకు నోటు కు ఓటు అమ్ముతూనేఉంటారు
ఇక్కడ ఓడేదెవరుఓటరేగదా!?
ప్రతి ఐదేళ్లకు ఒకసారి పాలకుణ్ణి మార్చాలి
మార్పుమంచిదే మనభవిష్యత్తుకు
దేశ ప్రగతికి
ఉత్తమ ప్రజాస్వామ్య సౌధనిర్మాణానికి
ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి
ప్రజలు విజయం సాధించడానికి
దేశంలో నే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ బ్రతికి బట్ట కట్టడానికి
ఉత్తములకు పట్టంకడదాం
ఉత్తమ పాలననుఅందుకుందాం
=============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి