ప్రతీ ఇల్లో రంగస్థలం:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ప్రతీ ఇల్లో రంగస్థలం
ఇంట్లో రకరకాల వరుసల్లో పాత్రపోషణలు కొందరు జీవిస్తారు
ఇంకొందరు నటిస్తారు
కుటుంబం ఒక మూర్తిమత్వం వికాసకేంద్రం
నటనావేదిక
ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీల ఏర్పాటుతో
మన సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిడుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నటనలు
మనిషి జననం నుండి మరణం దాకా బ్రతకాలి ఉన్నతి సాధించాలి అనే మిషలో  ఇస్తే ఎన్నెన్నో నందులు, రాష్ట్రీయ,జాతీయ అవార్డులందే పెర్ఫార్మెన్స్ చూపే నటనాగ్రేసలు ఇంటింటా ఉన్నారు
ఎక్కడైనా నటించండి 
కానీ
అమ్మ దగ్గర ఆపదముంచుకొస్తుందని
అబద్ధపు నటనచూపకండి
మన ప్రాణదీపం ఆ అమ్మవెలుగే
 ఆ దీపం ఆరిపోకుండా చూడండి
ఆలి దగ్గర పిల్లల దగ్గర మీ అవార్డు 
విన్నింగ్ నటనచూపకండి ఎందుకంటే
ఇంటగెలిచి రచ్చగెలవాలి సుమా
ఏతావాతా తేలాల్సింది
మనం చేసే తప్పుడు పనులకు
మనం పెట్టుకున్న అందమైన పేరు 
గుడ్ పెర్ఫార్మింగ్ థియేటర్ ఆర్ట్


కామెంట్‌లు