ఓ విశ్వావసునామవత్సరమా
సకలమానవాళి శ్రేయస్సుకాంక్షించుమా!?
కాలగమనంలో మరో మజిలీ
విశ్వవసే ఆలంబన
షడ్రుచుల సమ్మేళనమే
ఉగాది పచ్చడి
చేదు వగరు తీపి కారం పులుపు ఉప్పు
చేదు వగరు ఆరోగ్య ప్రదమైన రుచులు
ఔషధీరుచులు
కారం పులుపు అల్సర్ బాధితులకు రుచించనివేగదా
తీపి మనతనువున నిండుకున్నచక్కర నిల్వలు
ఉప్పు రక్తపీడనపు హేతువు
ఓవిశ్వవసునామవత్సరమా
విశ్వ మానవాళికి సుఖసంతోషాలిమ్మా
నిరుద్యోగులకు ఉద్యోగాలు
నిర్భాగ్యులకు భాగ్యాన్ని
చూపులేని వారికి దారిదీపమై
కడుపేదలకు కష్టజీవులకు కడుపు నింపే అన్నంమెతుకై
ఆత్మారాముణ్ణి చల్లబరచమమ్మా
విద్యుక్త ధర్మాన్ని మరచి స్మార్ట్ ఫోను కు బానిసలైన వారిని
వారానికొక రోజు ఫోన్ హాలిడే ప్రకటించమని చెప్పమ్మా
పచ్చని ప్రకృతి విధ్వంసమై
మానవ మనుగడ దుర్లభమై
భారంగా బ్రతుకీడుస్తున్న
మానవాళికి జ్ఞానోదయం కలిగించమ్మా
వాట్సాప్ ఫేస్ బుక్ ఇన్స్టగ్రామ్ లలో నిత్యం ప్రేమలు ఒలకబోసే డిజిటల్ ప్రేమానురాగప్రియులకు ఆత్మీయ ఆలింగనం
ముఖాముఖి సంభాషణలను
కొనసాగించమని ఉద్భోదించమ్మా
చుట్టూత వేపలు,మామిండ్లు కోయిలలు
ఇప్పుడు అన్నీ ఆన్లైన్ లో కంటికింపైన చెట్లు పక్షులు ప్రకృతి
రీల్స్ వీడియోల రూపంలో చూసి ఆనందించే మేము రేపు మ్యూజియం ఆర్ట్ పీస్ లా బ్రతుకుతామన్న బాధ మిగులుతుందమ్మా
మున్ముందు Al పెను ముప్పు మానవాళి గోప్యతనుబట్టబయలుచేసి
మానవ విలువలు మృగ్యమై
మనిషిని చైతన్యహీనుణ్ణి చేయుననే ప్రమాదముందని
ఈ మానవ కోటికి చెప్పమ్మా
ఏ ఫేస్ బుక్ ఫ్రెండ్ ఎంత కాలముండునో!?
ఈ వాట్సాప్ ఆదరాభిమానాలు ఎంతకాలంకొనసాగునో?!
ఈ డిజిటల్ స్నేహాలు మంచి చెడుకి వారధైన ఈ సంధీయుగాన్ని ఏమని నిర్వచించాలో తెలియని అనామకులమ్మా!?
సకలమానవాళి మదిలో దయజాలి కరుణ విశ్వమానవ ప్రేమను ప్రతిష్టించమ్మా!?
స్వార్థచింతన, ఈర్ష్య, అసూయవంటి దుర్గుణాలను దూరం చేసి
పరోపకారం, ఆత్మసంతృప్తి, ఐకమత్యం వంటి విశిష్ట గుణాల్నీ పాదుగొల్పమ్మా!?
కులం పేర మతం పేర జరిగే కుమ్ములాటల్నీ బాపమ్మా!?
గెలుపే పరమావధిగా ఉచిత హామీలిచ్చే ఉత్త చెత్త నాయకులకు ఓటమిని చవిచూపమ్మా!?
మంచికి పెన్నిధివై చెడుకు కాళికవై
అన్నీ తమకే తెలుసనే కుహనా మేధావులకు
తాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే మూర్ఖశిఖామణులకు
గుబగుయ్యిమనేలా సమాధానమివ్వమ్మా!?
ఏటికేడు పెనుభారమవుతున్న
మానవ జీవనసరళి
రాజపూజ్యం అవమానం , ఆదాయ, వ్యయాలను సమతూకం చేయమ్మా?!
ఓ విశ్వావసునామవత్సరమా!?
మాపై మాకు విశ్వాసాన్ని కల్గించమ్మా!?
ఈ విశ్వాన్ని కాపాడే మనోబలాన్ని మాకు ఇవ్వవమ్మా!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి