రంగులు పసందులు:- కొమురవెల్లి అంజయ్య-సిద్దిపేట-సెల్...9848005676
రకరకాల రంగులు 
చక్కని అనుభూతులు
ప్రకృతిలో రంగులు 
లెక్కలేని హంగులు||

పూసుకుంటే రంగులు
మారుతాయి వేషాలు
కొత్త కొత్త రూపాలు
చేస్తాయి తమాషాలు||

రంగుల పసందులు
ఇంటి ముందు ముగ్గులు
పలికేను స్వాగతాలు
ఆత్మీయ పిలుపులు||

వానాకాలం మెరుపులు
ఆకసాన సింగిడీలు
మనసులకు మురిపాలు
మధురమైన తరంగాలు||

రకరకాల పక్షులు
రంగుల మైమరుపులు
చూపులకవి ఇంపులు
కొల్లగొట్టు మనసులు||

ఆదిమ కాలం గుర్తులు
రాళ్లపైన చిత్రాలు
చరిత్రకవి ఆనవాళ్లు
భవిత కవి పాఠాలు||

కుంచెలు వేసే రంగులు
ప్రదర్శనలో వసందులు
చేస్తారు దస్కతులు
వారు చిత్రకారులు||

మనసు హావ భావాలు
ప్రదర్శించు పలు రంగులు
మారే ముఖ కవళికలు
చెప్తాయెన్నో కథలు ||

నలుపు తెలుపు చిత్రాలు
పూర్వకాల సినిమాలు
నేటితరం సినిమాయలు
రంగులతో హంగులు||

రంగులతో జీవితాలు
ముడివడిన జ్ఞాపకాలు
కాదవి జారే కలలు
అనుభవాల పంటలు||
............................................


కామెంట్‌లు