అవుతాను :- భైరగోని రామచంద్రము :-చరవాణి :9848518597.
పుడమి తల్లి తనువుకు పచ్చని పైరుల వస్త్రమై 
పుడమి తల్లి నుదుట ఎర్రని సింధూరమై 
ప్రజలందరి ఆకలి తీర్చుటకై పుడమిని చదును చేసి 
పాడి పంటలు తీసే రైతునవుతా.....

ఇంటిలో వాళ్లందరిని చూసుకోవడానికి 
తల్లిని తండ్రినవుతా....

పల్లెను రక్షించడానికి పల్లె తల్లినవుతా 
గ్రామ పుర ప్రజలందరికీ సేవకుడనవుతా...

సరస్వతమ్మ ఒడిలోకి చేరి 
విద్యా బుధుడనవుతా 
విద్యా ఆర్తిని తీర్చే గురువునవుతా....

అన్యాయన్ని ఎదిరించి న్యాయాన్ని రక్షించే ధర్మమూర్తినవుతా 
ఎవరైనా ఉమ్మిన కక్కిన మల మూత్ర విసర్జన చేసిన 
చెత్త చేదారం పడేసిన శుభ్రం చేసే కార్మికున్నవుతా....

అవినీతిని నిర్ములించే దుర్మార్గు లను అంతమోందించే 
రక్షకభట సింహాన్నవుతా 
శత్రుముకలనుండి దేశాన్ని రక్షించడానికి భరతమాతకు సైనికున్నవుతా.....

బానిస సంకెళ్ళు తెంచి
భరతఖండంబుకు విముక్తి కలిగించిన ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ నవుతా 
ఆజాద్ సుకుదేవ రాజగురు ఊపిరినవుతా 
తుటాలకు తెగిపడ్డ అల్లూరి సీతారామరాజునవుతా 
భారత ఆర్మీనేర్పాటు చేసిన నేతాజీనవుతా 
కుతుబ్షాహీలనెదిరించిన సర్ధార్ సర్వాయి పాపన్ననవుతా 
నిజామునెదిరించిన కాళోజి దాశరథి వట్టికోటల వారసున్నవుతా 
పర రాజులకు ముచ్చేమటలు పట్టించిన మరో రాణి రుద్రమదేవినవుతా 

అవుతాను.... అవుతాను....
ధనస్వామ్యంపై పెట్టుబడి దారులపై తిరగబడి 
దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే 
కాలరుద్రుడనవుతా 
కడుబీదలను కనిపెట్టి 
అన్నపానీయాదులు అందించే 
దానశీలి నవుతా...
అవుతాను.... అవుతాను...
నవయుగ భారత నిర్మాణ నాయకుడనవుతాను.....
===============================
భైరగోని రామచంద్రము 
స్కూల్ అసిస్టెంట్, తెలుగు 
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్, సోమాజిగూడ,
హైదరాబాద్, 500041
చరవాణి :9848518597.

కామెంట్‌లు
Vojjala Sharath babu చెప్పారు…
బైరగోని గారూ! బాగుంది మీ కవిత్వ శైలి. శుభాభినందనలు. ఉపాధ్యాయుడిగా మీరు పిల్లలను ప్రోత్సాహిస్తూ... దిశానిర్దేశం చేసే అక్షరాలకు శుభాకాంక్షలు.