పుట్టెడు దుఃఖము : - భైరగోని రామచంద్రము :- చరవాణి :9848518597.
నా చిన్ని తల్లులు 
మీకెన్నో బాధలు 
పుట్టెడు దుఃఖము 
మనసులో దాచుకున్నరు 

పొద్దు పొద్దున లేచి 
పనులెన్నో చేచి 
ఉన్న ఇల్లును సక్కదిద్దుకొని 
మీరు బడికి వస్తరు 
కళాశాలకేళుతరు 
మీరు వెళుతున్న దారిలో 
ఇబ్బందులెన్నో ఎదురుకొంటరు 

నా చిన్ని తల్లులు
మీకు ఎన్నో బాధలు 
పుట్టెడు దుఃఖము 
మనసులో దాచుకున్నరు 

ఆపొద్దు ఆపొద్దు మీ చదువులు 
ఆత్మస్థైర్యం పెంచుకొని 
అడుగు అడుగు ముందుకేస్తూ 
ఆకాశమంత ఎత్తుకేదగాలమ్మ
సూర్యునిలా ప్రకాశిస్తూ 
చంద్రునిలా వెలుగులు 
ఈ జగతికి పంచాలమ్మా 

నా చిన్ని తల్లులు 
మీకు ఎన్నో బాధలు 
పుట్టెడు దుఃఖము 
మనసులో దాచుకున్నరు 


యాసిడు దాడులు అనుభవిస్తిరి 
కత్తిపొట్లను ఎదుర్కొంటిరి 
రాబంధుల్లాంటి మృగాలవేటకు బలైపోతిరి 
అధైర్యపడకుండ లక్ష్యాన్ని 
సాధించడంలో గురి పెడుతరు 
గుర్తుండిపోతరు 
మాకు ఆదర్శమవుతరు 

నా చిన్ని తల్లులు 
మీకెన్నో బాధలు 
పుట్టెడు దుఃఖము 
మనసులో దాచుకున్నరు.

=======================
భైరగోని రామచంద్రము 
స్కూల్ అసిస్టెంట్ తెలుగు,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్, సోమాజిగూడ,
హైదరాబాద్, 500041.


కామెంట్‌లు