మేడరాజు కూతురై
పగిడిద్ద రాజు భార్య అయ్యి
సారలమ్మ నాగులమ్మ జంపన్నల తల్లి అయ్యి
రక్తాన్ని చిందించిన.....
అడవికే అందాన్ని తెచ్చిన జాతర
జనజాతర
మన మేడారం జాతర
సమ్మక్క సారక్క జాతర
అడవికి కోయిల రాగం అందం
కోయ గూడెంలో శివసత్తుల సిగం అందం
జంపన్న వాగులో మునిగి
తల్లి గద్దెల చెంత ప్రత్యక్షం
గద్దెల వద్ద బంగారం(బెల్లం )ముద్దలేసి
తల్లి నేల తొక్కిన పుణ్యం
మన జన్మ ధన్యం
ఇదే జనజాతర
మన మేడారం జాతర
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి