అది పచ్చని పల్లెటూరు. పచ్చని పంట పొలాలను, నలు దిక్కులలో గుట్టలను, ఎటుచూసిన చెన్నంఘీ చెట్లను ఆకాశం ముద్దాడుతున్నట్లుగా ఉంటుంది ఆ ఊరు. ఆ ఊరే అంకుషాపురం. ఈ ఊరిలో నివసిస్తున్న శ్రీమతి భైరగోని కొంరవ్వ, శ్రీ మల్లయ్య గౌడ్ ల పుణ్యమూర్తులకు ఐదుగురు సంతానం. ఐదవ సంతానంగా రాముడు(రామచంద్రము) జన్మించారు.
రోజులు గడుస్తున్నాయి. రాముడు పెద్దవాడవుతున్నాడు. రాముడు ఏడవ తరగతి చదువుతున్నాడు. రాముడికి మంచిగా చదువుకోవడం, సెలవు దినాలలో తల్లిదండ్రులతో కలిసి బావి దగ్గరకు వెళ్లడం పొలం పనులు చేయడం అలవాటు.
ఎప్పుడు పొలం దగ్గరకు వెళ్లిన అవ్వ తోటి అక్కల తోటి అన్నతోటి వెళ్ళుతుండేవాడు. ఒక రోజు ఏమి జరిగింది అంటే అది ఎండాకాలం. భూమిని కాల్చే విధంగా ఎండలు మండుతున్నాయి.రాముడు వాళ్ళ అవ్వ నాన్న ఊరికి వెళుతున్నాము మేము అని చెప్పి రాముడును పొలం దగ్గర కు వెళ్లి సాయంత్రం వరకు ఉండి బర్రెలకు నీళ్లు పెట్టి గడ్డి వేసి పాలిచ్చే బర్రెను ఇంటికి తీసుకురామ్మన్నారు. ఊరికి వెళ్లిపోయారు.
రాముడు అవ్వ నాన్న మాట కాదనకుండా స్నేహితుడు కనక రాజుతో కలిసి ఉదయమే సద్ధి కట్టుకొని పొలం దగ్గరకు వెళ్లిపోయాడు. చూడు చూడు మంటూ ఆరోజు కరెంట్ లేక నీళ్లు తాగడానికి లేకుండ అయిపోయినవి. రాముడు, కనకరాజుకు మండే ఎండలకు దాహం తట్టుకోలేక బావిలోనుండి నీళ్లు చేదుకుందామని బర్రెలకు ఉన్న తాళ్లను తీసి కుండకు కట్టి చెదడం ప్రారంభించారు. చేయి జారీ కుండతో సహా ఒక దానికి ఒకటి కట్టిన తాళ్ళు కూడా బావిలో పడ్డాయి. అప్పుడు ఎలా ఎలా అని ఇద్దరు మిత్రులు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు.
కనకరాజు ఒక సలహా ఇచ్చాడు. మోటారు పైప్ పట్టుకొని బావిలోకి దిగుదాము. దాహం తీర్చుకొని తాళ్ళు తీసుకోని పైపు పట్టుకొని మీదికి ఎక్కుదాము అన్నాడు. సరే అని రాముడు ఒప్పుకున్నాడు. బావిలోకి ఒకరి తరువాత ఒకరు పైపు పట్టుకొని దిగారు. దాహం తీర్చుకున్నారు.మళ్ళీ పైకి ఎక్కడానికి పైప్ ను పట్టుకొని ప్రయత్నించారు. చేతులకు పట్టు దొరకక జారి కింద పడ్డారు.మళ్ళీ ధరి పట్టుకొని ఎక్కడానికి ప్రయత్నించారు.ఫలించలేదు. ఈ విధంగా వందకు పైగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇక ఎక్కడానికి ఓపిక లేక బావిలోనే పైపును పట్టుకొని ఉండి ఏడుస్తున్నారు. బావిలో ఉన్న పాములను చూస్తూ ఉంటే ఎక్కడ కాటు వేస్తాయోనని భయపడుతున్నారు. మమ్మల్ని రక్షించండి!మమ్మల్ని రక్షించండి! అని కేకలు వేస్తున్నారు. వీరి మోర ఎవరికీ వినబడటం లేదు.ఏడు గంటల సేపు ఎక్కడానికి ఎంత ప్రయత్నం చేసిన విఫలమే అయింది. ఇక ఏమి తోచక ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాము. మా ప్రాణాలు పోయే స్థితిలో ఉంది అని దైవన్ని వేడుకున్నారు.అంతలోనే వీళ్ళ బావి దగ్గరే బావి ఉన్న జెల్పర్లాల్ పొలం దగ్గరకు వచ్చాడు. పొలంలో బర్రెలు పడి మెస్తున్నాయి. అరే మల్లయ్య వాళ్ళు పొలం దగ్గర ఎవరు లేరా ఏంది అని పొలం దగ్గరకు వచ్చి బర్రెలను వరి పొలం నుండి వెళ్లగొడుతుంటే ఎవరో అరుస్తున్న అరుపులు వినబడ్డాయి జెలుపర్ లాల్ కు. ఎక్కడ చూసిన ఎవరు కనపడలేదు.నలుదిక్కులు చూసి చూసి బావి దగ్గరకు వచ్చాడు. బావిలోకి చూసే సరికి ఇద్దరు పిల్లలు ఏడుస్తూ మమ్మల్ని రక్షించు అన్న అని గట్టిగ మొత్తుకున్నారు. ఎట్లా కాపాడాలి అని అలోచించి జెల్పరు లాల్ తండకు ఉరికి పెద్ద తాడు తెచ్చి వేసాడు. ఆ తాడు సహాయంతో ఒకరి తర్వాత ఒక్కరు బావిలో నుండి పైకి ఎక్కారు. ఆ దేవుడు నీ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడాడు అని జెల్ పర్ లాల్ అన్నను గట్టిగ పట్టుకొని ఏడ్చి ఏడ్చి జరిగిన విషయం అంత చెప్పారు.
ఈ విధంగా రాముడు, కనక రాజు మరణం అంచుల్లోకి వెళ్లి వచ్చారు. చిన్న పిల్లలు అయినప్పటికీ కూడ రక్షించుకోవడానికి దైర్యంతో చాలా సార్లు ప్రయత్నాలు బావిలో చేశారు.ఈ కథ లోని రాముడు మన భైరగోని రామచంద్రము ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు.
ఇది వాస్తవంగా జరిగినది.
భైరగోని రామచంద్రము గారి ఆత్మ కథ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి