విశ్వములోని ప్రతి జీవికి
ఆదేరువు నీరే కదా!
మొదటి జీవి పుట్టినది
నీటిలోనే కదా!
బుక్కెడు బువ్వ లేకున్నా ఉండొచ్చు
దోసెడు నీళ్లు లేకుండా ఉండలేము కదా!
మేఘుడు వర్షం ఇచ్చిందే నీటిని కాపాడుకోమని
నదులు పరుగు పరుగున
ప్రవహించి పయోనిదిలో కలిసేంతవరకు మనకు
నీటి కరువు వచ్చేంతవరకు
నీటిని కాపాడుకుందామనె
సోయి రాదు
మండే ఎండలు వచ్చినప్పుడే కదా!
మనకు నీటి విలువ తెలిసేది
వర్షం సంవృద్దిగా పడినప్పుడే
ఇంకుడుగుంతలల్ల కుంటలల్ల చెరువులల్ల
డ్యామ్ లల్ల ప్రాజెక్ట్ లల్ల నీటిని
ఒడిసి పట్టి నింపండి
నీటి కరువు రాకుండ సోయి
తెచ్చుకొండి
కుంటలు చెరువులు ఆక్రమణనకు గురి కాకుండా చూసుకోండి
ఉన్న నీటిని కూడా కలుషితం
అవ్వకుండా జాగ్రత్త పడండి
మనల్ని మనమే కాపాడుకోవడానికి
ముందుకు రండి.
*********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి