ఆధునిక కాలంలో పిల్లలకు నా గురించి తెలియదు. కాబట్టి పిల్లలకు ఒకసారి నా గురించి తెలియజేద్దామని చిన్నారుల ముందుకు వచ్చాను.
హాయ్ పిల్లలు. మీరు ఎలా ఉన్నారు. నేను బాగానే ఉన్నాను. రైతు ఉన్నన్ని రోజులు, వడ్రంగి ఉన్నన్ని రోజులు, పుడమి తల్లి ఉన్నన్ని రోజులు, తుమ్మ చెట్టు ఉన్నన్ని రోజులు నేను బాగానే ఉంటాను.
ఏందీ పిల్లలు!నేను మాట్లాడుతుంటే బిత్తరపోయి చూస్తున్నారు. రైతు అని,వడ్రంగి అని, తుమ్మ చెట్టు అని, పుడమి తల్లి అని మాట్లాడుతున్నాడు ఎంది అని మీలో మీరు అనుకుంటాన్నారు కదా!.
అయ్యో పిల్లలు /చిన్నారులు మీరు బీరి పోయి చూస్తూవుంటే మిమ్మల్ని నేను చూడలేను.నేను మీకు అసలు విషయం చెప్పెస్తాను మరీ!. నా పేరు నాగలి. నన్ను తుమ్మ కర్రతో వడ్రంగి వాళ్ళు తయారు చేస్తే రైతులు భూమిని దున్నటానికి ఉపయోగిస్తారు.
పిల్లలు మీకు వ్యవసాయ పొలం ఉందా!మీ తండ్రులు వ్యవసాయం చేస్తారా! పొలం దున్నడానికి నన్ను(నాగలి) వాడుకుంటారు.నేను గట్టిగా ఉన్న నేలను పొడి పొడిగా చదునుచేస్తాను.చదునుచేసిన పొలంలో వర్షం పడగానే లేదా బాయిలోని నీళ్ళను పారిచ్చి విత్తనాలు చల్లుతారు.బురద పొలం దున్నీన తరువాత వరి నారు నాటుతారు రైతులు.ఈ విధంగా వ్యవసాయ పనులు జరుగుతున్న సమయంలో రైతులు నన్ను (నాగలి ) మరియు ఎద్దులను వాడుకొని వ్యసాయ యజ్ఞం చేస్తారు.
ఆరునెలలు నాతో (నాగలితో )రైతులు శ్రమిస్తే ఒక పంట చేతికి వస్తుంది.మీరు తినే రుచికరమైన భోజనం నన్ను (నాగలిని ), ఎద్ధులను రైతు ఉపయోగించుకొని పొలం దున్నీ విత్తనాలు చళ్ళితే మొలకెత్తిన కొన్ని రోజులకి పంట తీస్తారు. ఈ పండించిన పంటతో, కూరగాయలతో రుచికరమైన భోజనం మీరు భూజిస్తున్నారు.పల్లెటూరులోని రైతులు అందరూ నన్ను ఉపయోగించుకొని పచ్చని పొలంలో పంటలు తీస్తున్నారు.గ్రామాలలోని ప్రజలతో పాటు పట్టణ ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. ఒక్క రోజు నేను రైతుతో కలిసి పని చేయక పోతే పంట పండక మీరు ఆకలితో ఆలమటించాల్సిందే. రైతులను, ఎద్ధులను, వడ్రంగిని నా స్నేహితులుగా భావిస్తాను.
ఆధునిక కాలంలో ట్రాక్టర్లు, వివిధ రకాల యంత్రాలు పొలం దున్నడానికి వచ్చిన నా యొక్క (నాగలి )వినియోగం ఏమాత్రం తగ్గలేదు.పొలం దున్నీ, విత్తనాలు చల్లినప్పటినుండి, కలుపు మొక్కలు, గడ్డిని తీసేయడానికి నన్ను ఉపయోగిస్తారు.
అయ్యో!పిల్లలు మీకు నేను ఏవిధంగా అవతరించానో నా పూర్వ వృత్తాంతం చెపుతాను వినండి. లోకంలోని ప్రజలందరు ఆకలితో అలమటిస్తూ అన్నమోరామచంద్ర అని మొరపెట్టుకుంటే ప్రజలందరి ఆకలి తీర్చడానికి బలరాముడు భుజంమీద నాగలి వేసుకొని జన్మించాడు. ఈ విధంగా మొదటిసారిగా నాగలి పట్టుకొని పొలం దున్నిన రైతు బలరాముడు. అందుకే బలరామున్ని నా తండ్రిగా భావిస్తాను. అప్పటి నుండి రైతులందరు నన్ను (నాగలి )ఉపయోగించుకొని బీడుభూములను సైతం దున్నుకొని పంటలు పండించి ప్రజలందరీ ఆకలి తీర్చుతున్నారు.
నాకు సహాయంగా నాగటికానీ, కర్రు, ఎద్దులు ఉంటాయి. అందుకే వీటిని నా సహోదరులుగా భావిస్తాను.
పిల్లలు నా గురించి తెలుసుకున్నారు కదా!.నా యొక్క వినియోగము ఈ ప్రపంచానికి, ప్రజలందరికీ ఏ విధంగా ఉందో మీకు అర్థమైంది అని అనుకుంటాను. సరే నేను వెళుతున్న, రైతు నన్ను పొలం దున్నడానికి పిలుస్తున్నాడు. పిల్లలు ఉంటాను మరీ.
సర్వే జన సుఖినోభవంతు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి