ఆకులు రాలిన చెట్లు:- భైరగోని రామచంద్రము- చరవాణి :9848518597
ప్రకృతి అంటే పచ్చదనం
పచ్చదనం అంటే చెట్లు 
వసంత, గ్రీష్మ, వర్ష, శరదృ,
హేమంత ఋతువులో 
నిండు ఆకులతో ఉండి 
ఏ పువ్వో కాయో పండో 
ఆయుష్షును పెంచే ఆక్సిజన్ ఇచ్చి 
మీరు విడుదల చేసే 
యంత్రాలు, మోటార్ వాహనాలు 
విడుదల చేసే విషపూరితమైన పొగను గ్రహించితిమి.

శిశిర ఋతువు వచ్చేసరికి 
ఆకులు లేని చెట్లుగా నెల రెండు నెలలుగా మేము బాధపడుతుంటిమి 
మేము ఆకులు రాలిన చెట్లుగా 
ఉండడం ఎంతో బాధగా ఉండె 
పూజకు పువ్వును తినడానికి 
కాయను పండును ఇవ్వలేక పోతుంటిమి 
మా కిందికి ఆడుకోవడానికి వచ్చే బుడ్డోళ్లకు చల్లటి గాలిని 
నీడను ఇవ్వలేక పోతుంటిమి 
దారిన పోయే బాటసారులకు 
నీడను గాలిని ఇవ్వలేక పోతుంటిమి 
గుబురుగా ఉన్నప్పుడు కోయిలమ్మ వచ్చి కుసేది 
ఇప్పుడేమో మా మీదికి రాలేక పోతుందని 
అని బాధగా ఉన్న మాకు పట్టిన దుమ్ము దూళిని పొగను 
పోగొట్టుకొని మీకు స్వచ్ఛమైన 
గాలిని ఇవ్వడానికి మా ధర్మం మేము పాటిస్తుంటిమి 

మీరు మాత్రం ఏ ధర్మం పాటించకుండ 
మా వృక్ష జాతిని సర్వనాశనం చేస్తుంటిరి 
వృక్షో రక్షతి రక్షః అనే విద్యుక్తధర్మాన్ని 
పాటించకపోతుంటిరి 
మీ ప్రాణాలకు మీరే ముప్పు తెచ్చుకుంటున్నారని 
ఆకులు రాలిన చెట్లమైన మేము 
మానవ జాతి కోసమే ఆలోచిస్తుంటిమి.

********


కామెంట్‌లు