పుడమి ఎదపూలు:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
 మనసు మురిసేలా
పూలు విరిసేని
అల్లిన కవితల పరిమళమే
నింగీ నేల మెరిసే ఆమని ప్రేమలై
తెలుపు లో ఎరుపు చుక్క
తెలిపే శాంతాంతర క్రోధం
ధవళ కాంతి చీరపై 
నాట్యాలాడే సరసాంగి 
అందమైన మోముపై
నిగనిగల ముక్కున ముక్కెర 
చిందుల దరహాసం
కోపతాపాల కరిగించే 
అందాల అనురాగాల  ఆత్మీయ నేస్తాలు 
 పుడమి పురిటి పులకింతేలే ఈ పూలు

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Beautiful... Meaning beyond surface level poetic diction and even title. Congrats