వృత్తి చూపిన మార్గం: వెంకట రమణారావు -9866186864

   అదొక పల్లెటూరు. శేఖర్ , కృష్ణ, రమ్య, లక్ష్మి వీళ్ళందరూ  ఆ పల్లెటూరు లో ఉంటారు.7వ తరగతి చదువుతున్నారు. స్కూల్ చాలా దూరంగా వేరే వూరులో ఉంది. రోజూ ఇంటినుంచి తొందరగా బయలుదేరి ఒక జట్టుగా నడిచి స్కూల్ కి వెళ్తారు.
స్కూల్ గంట మోగింది.  టీచర్ హాజరు తీసుకుంటున్నారు. పరిగెత్తుకుంటూ క్లాస్ లోకి వెళ్ళారు ఆ నలుగురు. టీచర్ నవ్వుతూ ఎలాగైనా సరే మీరు నలుగురు రోజూ హాజరు టైం కి వచ్చేస్తారు. కూర్చోండి మీ ప్లేస్ లో అంటూ పాఠం మొదలు పెట్టారు.
రమ్య , లక్ష్మి ఎప్పుడూ చదువు లో ముందు అంటారు. శేఖర్ ,కృష్ణ ఎప్పుడూ వెనక పడి అంటారు. రమ్య శేఖర్ కి, లక్ష్మి కృష్ణ కి చదువులో సహాయం చేస్తూ అంటారు. 
పరీక్షలు ఉన్నపుడు ఆ నలుగురూ ఒకళ్ళ ఇంట్లో చదువుకుంటారు, 
పరీక్షలు దగ్గర పడుతున్నాయి. క్లాస్ లో రివిజన్ అవుతోంది. కృష్ణ, శేఖర్ క్లాస్ కి రావడంలేదు.
హాజరు తీసుకుంటూ టీచరు   కృష్ణ ,శేఖర్ ఎందుకు రావడం లేదు అని రమ్యని అడిగారు.
క్లాస్ లో మిగిలిన పిల్లలు అందరూ నవ్వుతూ , కృష్ణ వాళ్ళ నాన్నకి బాగాలేదు, అందుకే ఇంటింటికీ  వెళ్లి పాలు పోస్తాడు , పొలం లో గడ్డి కోసి వాళ్ళ గేదెలకి వేస్తాడు, పేడ ఎత్తి పిడకలు చేస్తాడు. వాడికి చదువు ఎందుకు టీచర్ అంటూ నవ్వారు.
శేఖర్ సంగతి ఏంటి మరి అని టీచర్ అడిగారు.
శేఖర్ కూడా అంతే, వాళ్ళ నాన్న వూర్లో లేరు, వీడు ఇంట్లో కోళ్ళు పెంచుతూ , కోడి గుడ్లు టౌన్ లో అమ్ముతాడు అంటూ నవ్వారు.
టీచర్ వెంటనే రమ్య కి లక్ష్మికి గట్టిగా చెప్పారు. ఇలా స్కూల్ మానేస్తే ఎలా పాస్ అవుతారు మీ ఫ్రెండ్స్ , రోజు స్కూల్ కి రావాలి అని చెప్పండి అని .
మేము వాళ్ళిద్దరికీ స్కూల్ లో చెప్పినవి రాత్రి పూట మా ఇంట్లో చెప్తున్నాం టీచర్. వాళ్ళు తప్పకుండా పాస్ అవుతారు. ఇంట్లో పరిస్థితి చక్కబడగానే వాళ్ళిద్దరూ స్కూల్ లో వస్తారు అన్నారు రమ్య , లక్ష్మి.
సరే వాళ్ళు పాస్ అయ్యేలా చేసే బాధ్యత మీదే. లేకపోతే నేను వాళ్ళని స్కూల్ నుంచి పంపించేస్తా అని హెచ్చరించారు టీచర్.
పరీక్షలు అయిపోయాయి. ఆ నలుగురూ ఇంట్లో తల్లితండ్రుల తో కలిసి ఇంటి పనులు చూసుకుంటూ సెలవులు గడిపేశారు.
రిజల్ట్స్ వచ్చాయి , రమ్య ,లక్ష్మి.ఇద్దరూ. క్లాస్ ఫస్ట్ అయ్యారు, శేఖర్ , కృష్ణ కూడా మంచి మార్కుల తో పాస్ అయ్యారు.
కాలం గడిచిపోయింది , హైస్కూల్ పూర్తి చేసుకుని. , వృత్తి విద్యా కోర్సులు తీసుకున్నారు రమ్య, శేఖర్, కృష్ణ. లక్ష్మి జూనియర్ కాలేజీ లో చేరింది.
10 సంవత్సరాలు గడిచాయి. జీవితం లో స్థిరపడ్డారు.
స్కూల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోంది. పిల్లలు అందరూ ఉత్సాహంగా గా స్టేజ్ అలంకరించారు.
హెడ్ మాస్టర్ గారు స్టేజ్ మీదకు వచ్చి , పిల్లలని ఉద్దేశించి , ఈ రోజు 
 మన స్కూల్ లో చదివి ఎంతో వృద్ధిలోకి వచ్చిన మన పూర్వ విద్యార్థులు మనముందు ఉన్నారు అంటూ రమ్య, లక్ష్మి, శేఖర్, కృష్ణ నీ  స్టేజ్ మీదకు పిలిచారు.
ఈ రోజు మీ.ముందున్న నలుగురూ మంచి స్నేహితులు,  మన స్కూల్ లో చదువుకున్నారు. ఇంట్లో తల్లి తండ్రులకి చేదోడు గా ఉంటూ చదువు సాగించారు.
ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో విందాం అంటూ ఆ నలుగురు నీ మాట్లాడమని చెప్పారు హెడ్ మాస్టర్.
ముందు రమ్య మొదలుపెట్టింది, ఇవాళ మేము మీ ముందర ఇలా గర్వంగా నిలబడడానికి ముఖ్య కారణం మా గురువులు. ముందుగా వారికి మా వినయ పూర్వక ప్రణామాలు.
నాకు.ఇంకా ఆ రోజులు గుర్తు ఉన్నాయి. శేఖర్ నీ, కృష్ణ నీ పాలు అమ్మే వాళ్ళు, పిడకలు చేసేవాళ్ళు, కోళ్ళు పెంచేవాళ్ళూ అంటూ గెలి చేసారు మా క్లాస్ మేట్స్ .
ఈ రోజు కృష్ణ ఒక సహకార డైరీ సంస్థ చైర్మన్, శేఖర్ ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీ కి చైర్మన్, నేను రెడీ మేడ్ బట్టల కంపెనీ కి ఓనర్ నీ. లక్ష్మి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్.
ఇంటి వృత్తులు ఎప్పుడూ చిన్నవి కావు, అవి జీవనాధారం. చదువుకుని ఆ పనుల్లో నైపుణ్యం తెచ్చుకుని, ప్రభుత్వ సహకారం తో మనము సొంతం నిలబడి మరికొంత మందికి ఉపాధి కల్పించాలి.
ఏ వృత్తి అయినా, నైపుణ్యం పెంచుకుంటే , మనమే ఒక కంపెనీ అవుతాము. ఎంతో మందికి ఉపాధి చూపిస్తాం.చదువు  మనకి మార్గం చూపిస్తుంది. 
కృష్ణ లేచి పిల్లల వేపు చూసి, తల్లి తండ్రులు చేస్తున్న పనులని చదువుతో ఇంకా బాగా ఎలా చెయ్యచ్చో నేర్చుకోవచ్చు. టెక్నాలజీ ఉపయోగించి చాలా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. నేను మా డైరీ సంస్థ లో  యాభై మందికి ఉపాధి ఇచ్చాను. పాలు ,పాల ఉత్పత్తులు, ఆర్గానిక్ ఎరువులు  సరఫరా చేస్తున్నాము.
శేఖర్ లేచి , చిన్నప్పుడు మేము చేసే పనులు చూసి స్కూల్ లో గేలి చేసేవాళ్ళు. ఇవాళ ఆ పనులే మమ్మల్ని ఇలా ఉన్నత స్థాయి లోకి తీసుకు వచ్చాయి. వృత్తి లో ఎక్కువ తక్కువ అంటూ ఉండవు, నైపుణ్యమే వృత్తికి ముఖ్యం.
లక్ష్మి పిల్లలతో ఇలా అంది. చూడండి పిల్లలూ, చదువు మనకి విజ్ఞానం ఇస్తుంది, తెలివితేటలకు మనం పదును పెట్టాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలి. వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, చేనేత, పువ్వుల పెంపకం, పళ్ళ తోటలు, కూరగాయలు , ఇలా ఏ పని అయినా సరే మీకు తెలిసిన విద్య నేర్చుకుని, స్కూల్ లో బాగా చదువుకుని , మీకు నచ్చిన వృత్తికి సంబంధించిన కోర్సు లు చదివి , మీరే సొంతం గా ఎంటర్ ప్రెన్యూర్ గా మారండి. స్టార్టప్ కంపెనీలు స్థాపించండి 
. పర్యావరణ హితమైన ఉత్పత్తులు చేపట్టండి. 
వృత్తి విద్యా కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటివే. ఒక చదువు ఎక్కువ ఇంకొకటి తక్కువ అంటూ ఏదీ లేదు. మీరు నిలబడి పది మందిని నిలబెట్టడమే గొప్ప చదువు .
ఈ రోజు నుంచి మీరందరూ కూడా జీతం తీసుకోడం కాదు జీతం ఇచ్చి పోషించే వృత్తి సంస్థలకి యజమానులు కావాలని ధ్యేయం పెట్టుకోండి. 
పిల్లల చప్పట్లతో మారు మ్రోగింది స్కూల్ అంతా. చాలా మంచి దిశా నిర్దేశం , సందేశం ఇచ్చారు మీరందరూ అంటూ కృష్ణ, శేఖర్ , రమ్య , లక్ష్మి నీ అభినందించారు హెడ్ మాస్టర్.


కామెంట్‌లు