అవినీతికి మందు. ( కల్పిత బేతాళకథ).:- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .-9884429899
 పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికొరకు స్మశానంలో ప్రవేసించి,బేతాళుడు ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి 
బయలుదేరాడు .
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల,శ్రమ మెచ్చదగినదే! మనప్రయిణంలో నీకు అలసట తెలియకుండా అవినీతికి మందు అనేకథ చెపుతాను విను...
అవంతి రాజ్య పొలిమేరలలో సదానందుడు ఆశ్రమం నిర్మించుకునిపలువురికి ఉచితవిద్యాదానం చేస్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలా తనవిద్యార్ధులకు సదానందుడు పాఠం బోధిస్తుండగా, అవంతిరాజు గుణశేఖరుడు,అతనిమంత్రి సుబుధ్ధి కలసి సదానందుని దర్శనానికి వచ్చారు. వారినిచూస్తూనే వారికి ఆసనాలు చూపించాడు.
ఆసానాలపై ఆసీనులైన రాజు,మంత్రి ,విద్యార్ధులతోకలసి పాఠం వినసాగారు.
" చిరంజీవులారా మీలో చాలమంది రాజ,మంత్రి కుమారులు ఉన్నారు.
యుధ్ధరంగంలో సైన్యాలను షడంగ దళాలుగా విభజన జరిగినట్లు కౌటిల్యుని అర్ధశాస్త్రం లోనూ,కామాందకీయంలోనూ,మానసోల్లాసం లో వివరింపబడింది.'మొత్తాలవారు ' 'కైజీతగాండ్రు'అనే సైన్య విభాగాలు అర్ధశాస్త్రం లో చెప్పబడిన 'భృతబలం' శ్రేణులుగా కనిపిస్తుంది.మెదట షడంగ దళాల గురించి చెపుతాను.
'మౌన బలం'ఈ బలగాలు తమ ఉనికిని మాత్రం రాజు మీద ఎక్కువ ఆధారపడి అతని నుండి సర్వదా మెప్పు కోరుతుంది.వంశపారంపర్యంగా నమ్మకంగా రాజును సేవించేది.
'భృతబలం'ఈదళాలు రాజుకు చేరువగా ఎల్లప్పుడూ ఉంటాయి.బృతబలం అంటే అప్పటికప్పుడు జీతం ఇచ్చి సమకూర్చుకునేది.యుధ్ధం అంటే ముందువరసలో ఈ దళమే ఉంటుంది.
'శ్రేణిబలం'దేశాభిమానం ఎక్కువకలిగిన దళంఇది.యుధ్ధంవలన జరిగే లాభ నష్టాలు,కష్ట సుఖాలు సమంగానే ఇది భరిస్తుంది.
'సహృద్ బలం'మిత్ర సామంత రాజులవలన పొందిన సైన్యంఇది.
'ద్విషన్ బలం'ఒకప్పుడు శత్రువుగా ఉండి సంధి వలన కాని మరేవిధంగా అయిన రాజుకు వశపడిన సామంతుడు సహాయార్ధం పంపే బలాన్ని 'అమిత్ర బలం' అంటారు.
అటవీబలం.పుళిందులు,శబరులు మోదలగు అటవిక కూర్ప బడిన సైన్యం.
చతురంగ దళాలు అంటే.రథ,గజ,తురగ,పథాతి దళాలతో కూడిన దళాలు.
ఇంకా,షడ్ గుణాలు అంటే. తనకన్నా శత్రువు బలం కలిగిన వాడైతే,అతనితో సఖ్యత పడటాన్ని 'సంధి'అంటారు.
శత్రువుకన్న ఎక్కువ బలం కలిగి యుధ్ధం ప్రకటన చేయడాన్ని'విగ్రహం'అంటారు.
బలం ఆధిక్యంగా ఉన్నప్పుడు దండయాత్త చేయడాన్ని 'యానం'అంటారు.
సమ బలం ఉన్నప్పుడు సమయ నిరీక్షణ చేయడాన్ని'ఆసనం'అంటారు.
ఇతర రాజుల సహాయం లభించినప్పుడు ద్వివిధాన నీతి ప్రవర్తనను'ద్వైధీభావం'అంటారు.
బలం కోల్పోయినపుడు శత్రు ధనాన్ని పీడించడాన్ని'సమాశ్రయం' అంటారు, ఈరోజు పాఠానికి స్వస్తి " అన్నాడు సదానందుడు.
పాఠం పూర్తిఅయిన అనందరం "విజయోస్తు గుణశేఖర మహరాజులకు "అని ఆశీర్వదించాడు.
గుణశేఖరడు సదానందునికి నమస్కరిస్తూ "గురుదేవ రాజ్యంలో అవినీతి పెరిగిపోయింది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అవినీతిని అరికట్టలేకపోతున్నాము.ముఖ్యంగా రాజఉద్యోగులను నియంత్రించడం చాలాకష్టంగా మారింది. ఆవిషయమై తమసలహ తీసుకుందామని వచ్చాను"అన్నాడు గుణశేఖరుడు.
" మహరాజా అవినీతికిమందు కఠినచట్టమే ! దాన్ని సరిగ్గా అమలు జరిపితే ఫలితం కనిపిస్తుంది. నేను తమకు చెప్పే మూడు సూచనలను వారా

నికి ఒకటి చొప్పున అమలుపరచండి "అని మూడు సూచనలు వివరించాడు సదానందుడు.
"విక్రమార్క మహరాజా సదానందుడు గుణశేఖర మహరాజుకు చెప్పిన మూడు సూచనలు ఏమిటి? వాటితో అతను తన రాజ్యంలో అవినీతిని రూపుమాపగలిగాడా? సమాధానం తెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు "అన్నాడు బేతాళుడు.
" బేతాళా చట్టం నిజాయితీగా అమలు కావాలంటే నిర్ణయాలు ఖటినంగా ఉండాలి.అప్పుడే తప్పు చేసేవారు భయపడతారు. గుణశేఖరుడు సదానందుని మూడు  సూచనలు ఇలా అమలు చేసిఉంటాడు...అవంతి రాజ్యమంతటా...ఇందుమూలంగా తెలియజేయడమేమనగా లంచంతీసుకుంటూ పట్టుబడిన వారికి అదేరోజున ఉరితీయబడతారు అని రాజుగారి ఉత్తర్వు అని దండోరావేయించాడు మంత్రిసుబుధ్ధి. వారంరోజులలో ఎక్కడా లంచంతీసుకున్న ఫిర్యాదులు రాలేదు. రెండోవారంలో లంచంతీసుకునే వారితోపాటు ,ఇచ్చేవారుకూడా ఉరితీయబడతారని దండోరా వేయించాడు మంత్రి. మూడవ వారంలో లచం తీసుకునేవారు,ఇచ్చేవారి కుటుంబసభ్యులుకూడా ఉరితీయబడతారు అని అవంతి రాజ్యం అంతటా దండోరా వేయించాడు మంత్రి సుబుధ్ధి. నెలరోజుల వ్యవధిలో అవంతి రాజ్యంలో అవినీతి సమూలంగా రూపుమాసిపోయింది "అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనగం కావడంతో శవంతో సహమయ్యాడు బేతాళుడు.
బేతాళునికై మరలా వెను తిరిగాడు విక్రమార్కుడు.

కామెంట్‌లు