పట్టువదలని విక్రమార్కుడు చెట్టుకు వేళ్ళాడుతున్నశవంలో ఉన్న బేతాళుని బంధించి భుజనవేసుకుని మౌనంగా బయలుదేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'రాజా నన్ను పట్టిబంధించగల నీధైర్య సాహాస పరాక్రమాలు అభినందించ దగినవే ,దారిలో నీకు ప్రయాణ అలసట తెలియకుండా నీకు గుణనిధి మహరాజు కథ చెపుతాను విను...
పూర్వం ఉవిషరాజ్యాన్ని గ్రహబుజుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆయనకు మాణిక్యవీణ అనేకుమార్తె ఉంది.అందము,బుధ్ధి,మిక్కిలి తెలివితేటలు కలిగిన తన కుమార్తె కు తగిన వరునికొలకు ఎందరినో అన్వేషించగా, కాంచిపుర రాజు గుణనిధి అందము ,తెలివి,వీరత్వము, సకలప్రాణకోటి భాషలు తెలిసినవాడుగా గుర్తించి అతనికి తనకుమార్తె మాణిక్యవీణ తొ వివాహం జరిపించాడు గ్రహభుజుడు.
తనభార్యతొ కాంచిపురం చేరిన గుణనిధి రాజు సంతోషంగా కాలంగడప సాగాడు. ఒకవరలో రెండు కత్తులు ఇమడవు,భార్యాభర్తలు యిరువురు అతిమేథావులైతే సమస్యలకు కొదవేముంటుంది. ఒకరోజు రాత్రి తనభార్యతో శయన మందిరంలో నిద్రిస్తున్నమణిమాన్ కు మెలకువ వచ్చింది.తమ మంచంకింద చీమలు మాట్లాడుకోవడం వినసాగాడు. ''త్వరగా వెళ్ళండి సేవకులు వచ్చారంటే రాజుగారి గది శుభ్రపరుస్తూ మనల్ని చీపురుతొ నెట్టివేస్తారు''అన్నాయి వెనుక వరుసలోని చీమలు.
''రాజుగారు శయ్యపై రాణిగారితో కలసినిద్రిస్తున్నారు వారిని కింద వెళ్లడం సభ్యత కాదని ఆగాము'' అన్నాయి ముందు ఉన్న చీమలు.
''అలాఅయితే శయ్యను పక్కకుజరిపి వెళదాం'' అన్నాయి వెనుక చీమలు.
''అలా చేయడం సంస్కారంకాదు అని ఆగాము'' అని అన్నాయి ముందు చీమలు.
చీమల మాటలకు ఫక్కున నవ్యాడు మణిమాన్ రాజు. అతని నవ్వుకు మెలకువ వచ్చిన రాజుగారి భార్య '' నాథా ఇంతరాత్రి సమయంలో ఒంటరిగా నవ్వుకుంటున్నారు ఏమిటివిషయం'' అన్నది. '' దేవిచీమలుమాటల్లోని డాంబికానికినవ్వువచ్చింది' అన్నాడు. 'ఏమిటామాటలు నాకు చెప్పప్పండి'' అన్నది.
" దేవి అదిపరమ రహస్యం ఆవిద్యనేర్పిన గురువు ఈ విద్యద్వారా నీవు తెలుసుకున్న విషయం ఇతరులకు తెలియజేస్తే మరణిస్తావు అన్నాడు కనుక నేను చెప్పలేను'' అన్నాడు.
''ఎందుకులెండి చెప్పడం ఇష్టంలేదు అంతేకదా'' అన్నదిరాణి.
రాణిపై అమితప్రేమ ఉన్నరాజు " సరే రేపుచెపుతాను'అని మరుదినం తనదహన సంస్కారానికి కావలసిన ఏర్పాట్లు అన్నిచేయిస్తుండగా అక్కడ రెండు గొర్రెలు మాట్లాడు కోవడం వినిపించింది.అక్కడఉన్న ఆడగొర్రె '' ఏమిటి నన్ను ప్రేమిస్తున్నావా,అయితే అక్కడ పాడు పడినబావి ప్రాంతంలో ఓత్తుగా పెరిగిన పచ్చిగడ్డి తీసుకువచ్చి నాకు తినిపించు' 'అంది." ప్రేయసి అది అపాయకరమైన ప్రదేశం అక్కడ భయంకర విష సర్పాలుఉన్నాయి,అక్కడకు వెళితే ప్రాణాలు పోతాయి'' అన్నది పొట్టేలు.''ఏమిటి ప్రేయసి కొసం ప్రాణాపాయకరమైన పనిచేయలేవా ఇంతేనా నీకు నామీద ఉన్న ప్రేమ.అదిగో గుణనిధి రాజుచూడు తనభార్యకోసం మరణించ బోతున్నాడు, ప్రేమఅంటే అది'' అంది ఆడగొర్రె.
''ఓసి మూర్కురాల ప్రేమించినవారిని మరణించమనడం తప్పు నువ్వుకాకుంటే మరోకరి తో సుఖపడతాను అంతేగాని గుణనిధి రాజులా మూర్కంగా ప్రాణాలు తీసుకోను, జీవితం జీవించడానికి అనితెలుసుకో నీలాంటి వారి సంపర్కం ఆపదతో కూడుకుంది నువ్వువద్దు నీప్రేమ వద్దు'' అనివెళ్లి పొయిందిపొట్టేలు.
అదివిన్న గుణనిధి రాజు ,జంతువులకే జీవితంపై ఇంత అవగాహనఉంటే ,మనిషిగాపుట్టిన తను భార్యను సంతోషపరచడానికి తనుప్రాణత్యాగంచేయ బోవడం ఎంత తప్పో తెలుసుకున్న రాజు మాణిక్యవీణను మార్చుకుని సుఖించాడు.
'రాజావిక్రమార్క వీరందరిలో ఎవరు తెలివైనవారో చెప్పు.తెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు'అన్నడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు.
" గుణనిధి రాజుకు జ్ఞానోదయం కలిగించిన పొట్టేలు గొప్పది''అన్నాడు విక్రమార్కుడు.
అలామౌనభంగం కావడంతో బేతాళుడు కట్లు విడిపించుకుని శవంతొసహా రివ్వున ఎగిరి పోయాడు.పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు మరలా వెనుతిరిగాడు.
గుణనిధి. కల్పిత బేతాళకథ.:- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .-9884429899
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి