పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికొరకు స్మశానంలో ప్రవేసించి,బేతాళుడు ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి
బయలుదేరాడు .
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల,శ్రమ మెచ్చదగినదే! మనప్రయిణంలో నీకు అలసట తెలియకుండా శంకరయ్య సందేహం అనేకథ చెపుతాను విను...
ధరణికోట రాజ్యాన్ని గుణశేఖరుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. అతనిమంత్రిపేరు సుబుధ్ధి. ఒకసారి తమ పొరుగునఉన్న సింహపురిలో సంగీత సాహిత్య సభలకు వారు ముఖ్యఅతిథిగా గుణశేఖరుని ఆహ్వనించారు.పనులవత్తిడివలన గుణశేఖరుడు వెళ్ళలేక సంగీతప్రియుడైన తనమంత్రిని ఆసభకు తనప్రతినిధిగా పంపించాడు.
మంత్రి సేనాపతి,కొందరిసైనికులతో బయలుదేరి పగటి భోజనసమయానికి యడ్లపాడు అనేగ్రామం చేరారు .గ్రామాధికిరిఇంట భోజనం ముగించి విశ్రాంతి తీసుకోసాగాడు మంత్రి సుబుధ్ధి.
శంకరయ్య అనేసిపాయి మంత్రి ఏకాంతంగాఉండటంచూసి నమస్కరిస్తూ
" అయ్యగారు నాకోసందేహం తమరు అనుమతిస్తే విన్నవిస్తాను "అన్నాడు. " అడుగు నాయనా నావలన తీర్చగలిగే సందేహం అయితే తప్పకతీరుస్తాను" అన్నాడు మంత్రి.
" అయ్య నాపేరు శంకరయ్య, సైన్యాధ్యక్షుడు నేను చేస్తేది ఒకేవృత్తి, ఇరువురం ఏలికవారికి,ప్రజలకు రక్షణ కలిగించే బాధ్యతలోఉన్నాం.సమానంగా ఇరువురం కష్టపడుతున్నాం.సైన్యాధిపతికి ఎక్కువజీతం,హొదా,సౌకర్యాలు ఎక్కువకలిగించి నాకుమాత్రం తక్కువజీతం,తక్కువ సౌకర్యాలు కలిగించారు. ఈవెత్యాశం ఎందుకు?.ఇదేంన్యాయం "అన్నాడు శంకరయ్య.
"మంచి సందేహం తప్పక తీర్చవలసిందే. అదిగో అక్కడ కొద్దిదూరంలో వేపచెట్టుకింద ఓవ్యక్తి విశ్రాంతిపొందుతున్నాడు,అతను అతను ఏఊరివాడో వివరం తెలుసుకురా "అన్నాడు మంత్రిసుబుద్ది.
తనసందేహనికి సమాధానం చెప్పకుండా ఈబాటసారితో మనకేంపని అనిఅనుకుంటూ అతనివద్దకువెళ్ళి ఏఊరివాడోతెలుసుకుని,మంత్రివద్దకువచ్చి "మంత్రివర్యా అతను కొండవీటి గ్రామస్తుడట "అన్నాడు. "ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకురా "అన్నాడు మంత్రి. తెలుసుకువచ్చిన శంకరయ్య " గణపవరం వెళుతున్నాడట "అన్నాడు. "ఏంపని మీదవెళుతున్నాడో తెలుసుకురా " అన్నాడు మంత్రి.తెలుసుకువచ్చిన శంకరయ్య " అయ్యా అతను తనకుమార్తెను చూడటానికి వెళుతున్నాడట"అన్నాడు.
చేరువలోని సైన్యాధికారిని పిలిచి " సైన్యాధిపతి అక్కడ దేవాలయంలో ఓజంట కూర్చుని ఉన్నారు వాళ్ళెవరో తెలుసుకురా "అన్నాడు మంత్రి.
ఆయువతి,యువకులవద్దకు వెళ్ళి మాట్లాడివచ్చిన సేనాపతి "మంత్రివర్యా వారి పేర్లు భాస్కరుడు,జ్యోతి ఈమాసం ఆరంభంలో వారికివివాహం జరిగిందట.ఆయువకునిది బొప్పిడు గ్రామం,ఆయువతిది బండారుపల్లిగ్రామం అట వారు అమరావతిలోని శివాలయం దర్శనానికి వెళుతూ విశ్రాంతి కొరకు ఆదేవాలయ మండపంలో విశ్రాంతి కొరకు ఆగారట "అన్నాడు సైన్యాధికారి.అతన్నిపంపించాడు మంత్రి .
తను అడిగిన సందేహనికి ఇక్కడజరుగుతున్న తంతుకి సంబంధం ఏమిటో అర్ధంకాని శంకరయ్యకు అంతా అయోమయంగా కనిపించింది.
" శంకరయ్య అర్ధం అయిందా ?"అన్నాడు మంత్రి. తనతల అడ్డంగా ఊపుతూ "ఏమి అర్ధం కాలేదు "అన్నాడు శంకరయ్య.
" విక్రమార్క మహరాజా శంకరయ్య సందేహన్ని మంత్రి ఎలాతీర్చాడో చెప్పగలవా? తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు "న్నాడు బేతాళుడు.
" బేతాళా పిండికొద్ది రొట్టటె అంటే ఇదే! మంత్రి శివయ్యతో ఇలా అని ఉంటాడు... నాయనా విద్యార్హత,తెలివితేటలనుబట్టి ఏపదవైనా లభిస్తుంది.ఉదాహరణకు నీకు,సైన్యాధికారికి ఒకేవిధమైన పని అప్పగించాను. ఆవ్యక్తి వివరాలు తెలుసుకోవడానికి నీవు మూడు సార్లు తిరిగావు.సైన్యాధికారి ఒకేపర్యాయంలో ఆదంపతుల పూర్తివివరాలు తెలుసుకున్నాడు.అందుకే అతను సైన్యాధికారిగా,నువ్వు సిపాయిగా ఉన్నావు. విద్యతోపాటు వ్యవహర సరళిలో తనకన్నా ఎంతో ప్రతిభ కనపరిచినందునే అతను సైన్యాధికారి కాగలిగాడని గ్రహించాడు శంకరయ్య " అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహ మాయమైనాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.
శంకరయ్య సందేహం. కల్పిత బేతాళ కథ.:- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .-9884429899
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి