విద్యా బడ్జెట్ ఇది నిరాశాజనకం:-వెంకట్ రెడ్డి -సామాజిక కార్యకర్త-9949865516

 2025-26 సంవత్సరానికి TS విద్యా బడ్జెట్ కేవలం 7.57% (₹23,108 కోట్లు) మాత్రమే, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 15% కంటే చాలా తక్కువ. ఇది నిరాశాజనకం2025-26  ఆర్ధిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్  మొత్తం 3,04,965 కోట్ల కాగా విద్యకు కేవలం 23,108 వేల కోట్లు (7.57%) మాత్రమే కేటాయించి సంక్షోభం లో ఉన్న ప్రభుత్వ విద్యను బయట పడేయలేరు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సమాజం విద్యకు 15% కేటాయించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ముఖ్యమంత్రికి వేలాది ఇతరాలు రాసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు అనడానికి బడ్జెట్ లోన్ అంకెలే సాక్ష్యం. ఇప్పటికే ప్రభుత్వ విద్య మీద నమ్మకాన్ని కోల్పోయి 65% తల్లిదండ్రులు ఆర్ధిక భారం అయిన ప్రైవేటు పాఠశాలలో చదివించుకుంటున్నారు. 
పేద వర్గాల పిల్లల కు నాణ్యమైన విద్య ను ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేటాయించిన బడ్జెట్ అత్యధిక శాతం విద్యా శాఖ సిబ్బంది జీత భత్యాలకే ఖర్చు అవుతుంది. ఇంటిగ్రేటెడ్ ప్రతిష్టాత్మకం అని చెపుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలు కిరాయి బిల్డింగులలో నడుస్తున్న వాటి స్థానం లో ఏర్పాటు చేస్తున్నవే తప్ప అదనంగా విద్యార్థులకు విద్య ను అందుకునే అవకాశం లేదు. 

కామెంట్‌లు