బాలుని అభిలాష:- --గద్వాల సోమన్న ,9966414580
పూవులోని తావినై
వెన్నెల్లో వెలుగునై
అందరికి సాయపడతా!
అమ్మలోని ప్రేమనై

పారిజాత పూవునై
నెలరాజు నగవునై
అందాలే రువ్వుతా,!
కొలనులోని కలువనై

మాలలోని దారమై
పాలలోని బలమునై
అభాగ్యులకు తోడవుతా!
ఆపద్బాంధవుడనై

మహాత్ముల మాటనై
జగతి ప్రగతి బాటనై
ఆదర్శం చూపుతా!
అనురాగాల తోటనై

జీవజలపు ఊటనై
మమకారాల కోటనై
ఆనందమందిస్తా!
మనసు దోచే పాటనై

సత్యానికి సాక్షినై
న్యాయానికి నేతనై
సహకరమందిస్తా!
ధర్మానికి కర్తనై


కామెంట్‌లు