పెద్దయ్య మేలి పలుకులు:- --గద్వాల సోమన్న ,9966414580
కలలోని కోరికలు
ఇలలోన పండాలి
గుండెల్లో ప్రేమలు
పండుగై జరగాలి

చిన్ననాటి బంధము
సన్నజాజి కావాలి
కన్నవారికి పేరు
మిన్నగా తేవాలి

ఎన్ని బాధలొచ్చిన
అన్నింటిని తరమాలి
పిన్న వయసు వారికి
కొన్ని శుభుమలివ్వాలి

గొప్ప మనసును కలిగి
మెప్పుగా బ్రతకాలి
తిప్పలెన్ని యున్నా
తప్పక జయించాలి


కామెంట్‌లు