తల్లి ప్రబోధ గీతిక;- -గద్వాల సోమన్న,9966414580
కష్టపడితే గనుక
జీవితమే సఫలము
లేకపోతే మాత్రము
అడుగడుగునా విఫలము

ఇల విపత్కాలంలో
యోచించాలి పథకము
పోటీ ప్రపంచంలో
సాధించాలి పతకము

మన దేశ కీర్తి కోసము
ఉండాలోయ్! పౌరుషము
దేశభక్తితో మనము
చేయాలోయ్!సాహసము

ఉంటేనే పట్టుదల
జీవితాన పెరుగుదల
లేకుంటే  అభివృద్ధి
క్రమేణా తరుగుదల


కామెంట్‌లు