పల్లెసీమకు స్వాగతం:- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు,9966414580
పల్లె సీమ అందాలు
అద్భుతమైన దృశ్యాలు
అలరించును హృదయాలు
కట్టేయును నయనాలు

అంతటా పచ్చదనము
విందు చేయు చక్కదనము
వర్ణింపనెవరి తరము!
పల్లెసీమ గొప్పదనము

పచ్చపచ్చని పొలములు
కాలువల్లో జలములు
కడు ముగ్ధమనోహరమే!
ప్రకృతి వర ప్రసాదమే!

పక్షుల కోలాహలము
రైతుల మందహాసము
చిరు గాలుల సవ్వడిలో
పైరుల నట విన్యాసము

స్వచ్ఛమైన వాయువులు
దొరుకు చోటు పల్లెటూరు
బంధాలకు పుట్టినిల్లు
ఆత్మీయతల పొదరిల్లు

ఒక్కసారి వచ్చిపోండి!
ఉచితంగా చూసిపోండి!
పల్లెసీమ అందాలు
పలికేను స్వాగతమండి!


కామెంట్‌లు