ప్రథమం :- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
              సోమగిరి గ్రామంలో కావ్య అనే అమ్మాయి ఉండేది. కావ్య చదువుతోపాటుగా ఆటపాటల్లో ప్రధమంగా నిలిచేది. కావ్యతో చిన్నారులందరు స్నేహం చేసేవారు. కావ్య మాత్రం అన్నింటా నేనే ప్రథమం అని పొంగిపోయేది.
             పాఠశాలలో ఒకసారి ఆటల పోటీలు జరుగుతున్నాయి. క్రీడామైదానంలో రెండు చుట్లూ తిరిగి రావాలని అందరికీ పరుగు పందెం పోటీ పెట్టారు.  అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు. కావ్య కన్నా ముందు పరిగెడుతున్న అమ్మాయి రజని ఒక్కసారిగా కింద పడిపోవడంతో మోకాలుకు దెబ్బ తగిలి రక్తం కారసాగింది. వెనకాలే వస్తున్న కావ్య   రక్తం కారుతున్న రజనిని పట్టించుకోకుండా పరిగెత్తసాగింది. కావ్య వెనకాల వస్తున్న గిరిజ తన పరుగు పందెం పోటీ ఆపి, తన జేబు రుమాలు తీసి, రజనికి కట్టు కట్టి, ఉపాధ్యాయుల వద్దకు తీసుకవెళ్ళి, శస్త్ర చికిత్స చేసింది. కావ్య మైదానంలో మరో చుట్టు చుట్టి అందరికంటే ప్రథమంగా పరుగెత్తి బహుమతి గెలుచుకుంది.
            కానీ కావ్య మనసంతా దిగాలుగా ఉంది. పరుగు పందెంలో తాను పొందిన బహుమతి కంటే, కిందపడి గాయాల పాలైన రజనికి శస్త్ర చికిత్స చేసిన గిరిజనే విజేత అని మనసులో అనుకుంది. తన బహుమతిని తీసుకువెళ్లి గిరిజకు ఇచ్చింది. ఉపాధ్యాయులతో పాటుగా, విద్యార్థులందరూ కరతాల ధ్వనులతో కావ్యను అభినందించారు.


కామెంట్‌లు