మా చిన్న అభిప్రాయం :- తత్తరి అక్షిత, - 9వ తరగతి, -బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల,- అంబర్ పేట . హైదరాబాద్

  మేము ఒక చిన్న జీవులం. మమ్మల్ని దగ్గరనుంచి చూస్తేనే ఎవరికైనా కనిపిస్తాము. మేమందరం కలసి పనిచేస్తాం. ఐకమత్యంగా ఉంటాం. మేము ఎప్పుడూ కొట్టుకోము. తిట్టుకోము. గొడవ పడం. కలసిమెలసి ఉంటాం. మేము వేరే వారి ఆస్తి, ధనం, నగల కోసం ఆశపడం‌ వాటి కొరకు అబద్ధాలు ఆడం. మరియు వాటిని దొంగలించం. మాకు ఎంత ఉన్నదో అంతలోనే సరిపెట్టుకుంటాం.మాకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కష్టపడి సంపాదించుకుంటాం. ఎందుకు ఇతరుల కష్టపడి సంపాదించుకున్నది దోచుకోవడం ? ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునేలా ఉంటాం. కానీ వారి సొమ్మును దోచుకునేలా పనిచేయము. మాకు రాజులూ లేరు. మరియు చెప్పేవారు లేరు. లేకున్నా మేమంతా కలిసికట్టుగానే వెళ్తాం‌. అది వరుసలోనే సుమా! మేము ఆరు నెలలు కష్టపడి సంపాదించుకుంటాం. మిగిలిన నెలలు విశ్రాంతి తీసుకుంటాం. మేము మానవులను కుడుతామని వారికి కోపం రావచ్చు‌‌.  కానీ మేము వాళ్ళని ఎందుకు 
కుడతామో వాళ్లకు తెలుసు.  వాళ్లపైన మాకు చాలా గౌరవం ఉంది. మాలా వాళ్లందరూ కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంగా నడవాలని మా ఈ చిన్ని చిన్ని చీమల అభిప్రాయం.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice God bless you Akshitha
Vojjala Sharath babu చెప్పారు…
బాగుంది నీ రచన. అభినందనలు పాప!