నా మాట వింటారా..... ? ( స్వగతం):- తత్తరి అక్షిత, - 9వ తరగతి, - బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, - అంబర్ పేట . హైదరాబాద్
 నేను ఎవరినో మీ అందరికీ తెలుసు 
నా వల్లనే కదా చెట్లు పెరుగుతాయి
 చెట్ల వల్ల కదా వర్షం పడుతుంది 
వర్షం వల్ల కదా పంటలు పండుతాయి 
పంటల వల్లనే కదా మీ అందరికీ ఆహారం దొరుకుతుంది. 
ఇలా 
నావల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మీకు 
నేను చెప్పుకుంటూ పోతే నా వల్ల మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో 
కానీ మీరు 
ప్లాస్టిక్ వస్తువులు 
ఫ్యాక్టరీలోని కెమికల్స్ ఇలాంటివి చాలా వేసి నన్ను కలుషితం చేస్తున్నారు.
నన్ను కాలుష్యం చేసిన నాకేమీ కాదు లెండి 
కాలుష్యం చేసుకుంటూ వెళ్ళిపోతే నష్టపోయేది మీరే కదా 
ఈ భూమి పుట్టినప్పటి నుండి నేనున్నాను 
మీ తాత ముత్తాత వాళ్ళు ఎవ్వరూ నన్ను ఇలా కాలుష్యం చేయలేదు    
మీరు నన్నే కాకుండా ప్రకృతి మొత్తాన్ని కలుషితం చేసేస్తున్నారు 
నేను లేకుంటే మీకు దాహం ఎక్కడ తీరుతుంది 
నేను కలుషితం అయిపోయాక కూడా నన్ను దాహం తీర్చుకోవడానికి ఉపయోగించుకునేది మీరే కదా 
అప్పుడు మీకే అనారోగ్యాలు వస్తాయి 
మీకే నష్టమవుతుంది ఇది మీకు తెలపాలని నా యొక్క చిన్ని మాట మీరు నన్ను ప్రకృతిని కాపాడుకోండి భవిష్యత్తులో ముందుకు సాగండి ఇంకా నేనెవరో అర్థం కాలేదా నేనే మీ 'నీరు' ని.
  
                                      

కామెంట్‌లు
Vojjala Sharath babu చెప్పారు…
బాగుంది. ఇలానే కొనసాగించు అక్షిత!
అజ్ఞాత చెప్పారు…
మీ స్వగతం నిజంగానే అందరూ మంచి చేయండి అని స్వాగతం పలికినట్లుగానే ఉంది తల్లి. నీ సాహిత్య పరిమళం చాలా బాగుంది. 💐💐💐💐👍👍👍🙏🙏🙏