ప్రభుత్వ బడి (సంభాషణ):- ఇ. అపర్ణ - 9వ తరగతి- పాఠశాల పేరు:- జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల నర్మెట్ట.
  అపర్ణ:- 
లాస్యా !మా ప్రభుత్వ బడికి వస్తావా.మా బడిలో పానెల్ బోర్డ్స్ ఉన్నాయి.
లాస్య :- 
మీ బడిలో చదువు బాగా చెప్పరు! నేను రాను.
అపర్ణ :- 
లేదు! లేదు! మా బడిలో చదువు బాగా చెబుతారు నువ్వు మా బడికి రావచ్చు కదా.
లాస్య :-
లేదు అపర్ణ .మా బడిలోనే చదువు బాగా చెబుతారు.
అపర్ణ :- 
నీ బడిలో ఫీజ్ తీసుకొని చదువు చెపుతారు. అదే మా ప్రభుత్వ బడిలో ఫీజ్ తీసుకోరు. మరియు చదువు చాలా బాగా చెబుతారు. మాకు పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తారు. మీ బడిలోనే ఫీస్ తీసుకుంటారు మల్ల ఫీజ్ కట్టకపోతే బడికి రానీయరు. అదే మా ప్రభుత్వ బడిలోనే ఫీజు లేదు . ఉచితంగా భోజనం పెడతారు.యూనిఫామ్ ఉచితంగా ఇస్తారు.ఇంకా మా టీచర్స్ మాకు రకరకాల బహుమతులు ఇస్తారు.మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు.మాకోసం ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేసి, మేమందరం అందులో పార్టిసిపేట్ అయ్యేలా చూస్తారు.
మాకు బడి అంటే భయం కన్నా ఇష్టం ఎక్కువ.
నువ్వు కూడా రావచ్చు కదరా.
లాస్య :-
 లేదు .మా బడిలోనే క్రమశిక్షణగా ఉంటారు. అదే మీ బడిలో టీచర్స్ పట్టించుకోరు.
అపర్ణ :- 
ఏంటి మా ప్రభుత్వ బడిలోనే క్రమశిక్షణగా ఉండరా. మా బడి చాలా స్ట్రిక్ట్.
చదివే పిల్లలనే కాదు.చదువులో వెనుక బడిన పిల్లలను కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తూ వారికి చదువు నేర్పిస్తారు.అంతేనా! బడికి ఎప్పుడూ తప్పించే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బడికి రప్పిస్తారు.మా పెద్ద సార్, ఇంకా మిగతా సార్లు, టీచర్లు అందరూ బడికి రాని వాళ్ళ ఇంటికి వెళ్ళి , బడికి వచ్చేలా చేస్తారు.అట్లా మా బడిలో ఎంత మంది పిల్లలు మంచిగా మారిపోయారో తెలుసా.
లాస్య :- 
నువ్వు ఇంత మంచిగా చెబుతున్నావు కదరా. నేను మీ ప్రభుత్వ బడికి వస్తాను.
అపర్ణ :- 
ఏంటి! మా ప్రభుత్వ బడికి వస్తావా నాకు చాలా సంతోషంగా ఉంది. అదే మీ బడిలో డబ్బులు తీసుకుంటారు. మీ అమ్మానాన్నలకు ఎందుకు ఇబ్బంది పెడతావు. నువ్వు మా బడికి వచ్చి మంచి పని చేశావు. మీ అమ్మా నాన్నకు ఇబ్బంది లేకుండా చేశావు. 
లాస్య
లాస్య :- 
అవును!మీ బడికి వచ్చి మా అమ్మ నాన్నలకు ఇబ్బంది పెట్టకుండా చేశాను.అపర్ణ.
అపర్ణ :- 
మీకు ఇంకొకటి తెలుసా .మా బడిలో  టీచర్లందరూ  చాలా బాగా చెబుతారు. మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు.వాళ్ళ కన్నబిడ్డల్లాగే మేమని చెబుతారు. లాస్య.
లాస్య :- అవునారా! ప్రభుత్వ బడికి వచ్చి మంచి పని చేసాను.
అపర్ణ :- 
మీ బడి కాదురా మనబడి.
లాస్య :- 
రేపటి నుంచి మనం ఇద్దరం కలిసి బడికి పోదాం.
   
  *ఇదే మా ప్రభుత్వ బడి                   గొప్పతనం *             

కామెంట్‌లు