పల్లవి: తేట తేనె తెలుగు
వెన్నెల వెలుగుల జిలుగు
చరణం : ఆదికవి నన్నయ
అక్షర రమ్యత తెలుగు
తిక్కన నాటకీయ
తీయదనం తెలుగు
చరణం: శ్రీనాధుని సీస పద్య
సిరిమువ్వ తెలుగు
పోతన భాగవత
భక్తి రసం తెలుగు
చరణం : పద కవిత అన్నమయ
సంకీర్తన తెలుగు
ఆట వెలది వేమన
అనుభవసారం తెలుగు
చరణం : సుమతి శతక బద్దెన
సూక్తి నిధి తెలుగు
గురజాడ కన్యక
తెలుగు తల్లి పుత్రిక
చరణం : ఆంధ్రభోజ దేవరాయ
భాషలందు లెస్స తెలుగు
మాతృభాష మాధుర్యం
అమ్మ పాల అమృతం
చరణం : తేనెల తీయదనం
తెలుగు భాషకే సొంతం
కమ్మనైన అమ్మ భాష తెలుగు
అవనిలో అందుకే ఎప్పుడు వెలుగు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి