మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
 

శ్లోకం;  
 రథ్యా చర్పట విరచిత కంథః
 పుణ్యాపుణ్య  వివర్జిత పంథః !
యోగీ యోగనియోజిత చిత్తో
 రమతే బాలోన్మత్తవ దేవ !

భావం:వీధుల యందు పడియున్న 
గుడ్డ పీలికలచే సమకూర్చబడిన
బొంత కలవాడును. పుణ్యాపుణ్యములకు అతీతమైన ఆత్మమార్గమున సంచరించు వాడును.ఆత్మయందు నియోగింప బడిన చిత్తము కలవాడను అగు యోగి బాలునివలె ,ఉన్మత్తునివలె తనలో తాను ఆనందించు చుండును(ఆత్మా నందమును పొందు చుండును). ఈ శ్లోకమును 
యోగానందాచార్యులవారు చెప్పిరి.
 ********

కామెంట్‌లు